ETV Bharat / bharat

ఉద్ధృతంగా రైతుల ఆందోళనలు

కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు చేపట్టిన ఆందోళనలు ఉద్ధృతంగా కొనసాగుతున్నాయి. హరియాణా అంబాలా సరిహద్దులో దిల్లీ వెళ్తున్న నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. భారీగా గుమిగూడిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు జల ఫిరంగులు, బాష్ప వాయువు గోళాలు ప్రయోగించారు. దీంతో ఆగ్రహించిన రైతులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు.

farmers protest against centres new farm laws
ఉద్ధృతంగా రైతుల ఆందోళనలు
author img

By

Published : Nov 26, 2020, 1:21 PM IST

కేంద్ర ప్రభుత్వం నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన 'చలో దిల్లీ' ఆందోళనలు పలు చోట్ల తీవ్ర రూపం దాల్చాయి. నిరసనల నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీ సరిహద్దులను ముందుగానే మూసివేశారు అధికారులు. హరియాణా అంబాలా సమీపంలోని శంభు సరిహద్దు వద్దకు భారీగా తరలివచ్చి దిల్లీ వెళ్లేందుకు ప్రయత్నించిన రైతులను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో గుమిగూడిన నిరసనకారులను చెదరగొట్టేందుకు జలఫిరంగులు, బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు పోలీసులు. ఈ చర్యతో ఆగ్రహించిన ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు విసిరారు. వంతెనపై ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి కిందకు విసిరారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

చలో దిల్లీ ఆందోళనల్లో భాగంగా హరియాణా కర్నాల్ సమీపంలో కర్నా సరస్సు ప్రాంతానికి రైతులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. రహదారిని దిగ్భంధించి దిల్లీ వైపు ర్యాలీ నిర్వహించారు.

కేజ్రీవాల్‌ విమర్శలు..

రైతుల ఆందోళన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విమర్శలు గుప్పించారు. 'కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతు వ్యతిరేకం. వాటిని వెనక్కి తీసుకోవడానికి బదులు ఆందోళన చేస్తున్న రైతులపై జలఫిరంగులు ప్రయోగిస్తున్నారు. శాంతియుత ఆందోళనలు చేయడం రాజ్యాంగ హక్కు' అని కేజ్రీవాల్‌ కేంద్రాన్ని దుయ్యబట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.