ETV Bharat / bharat

'ఆత్మనిర్భర్ భారత్' పునాదికి రైతులే కీలకం: మోదీ

లాక్​డౌన్ సమయంలో వ్యవసాయ రంగం తన సత్తా చాటుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశాన్ని ఆత్మనిర్భర్ భారత్​గా మార్చడంలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. అదే సమయంలో.. స్వాతంత్ర్య సంగ్రామంలో పోరాడిన వీరుల గాథలను కథల రూపంలో చిన్నారులకు పరిచయం చేయాలని సూచించారు.

PM Modi on #MannKiBaat
మన్ కీ బాత్
author img

By

Published : Sep 27, 2020, 12:03 PM IST

కరోనా లాక్​డౌన్ సమయంలో వ్యవసాయ రంగం తన సత్తా నిరూపించుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ఆత్మనిర్భర్ భారత్​ పునాదికి రైతులు, గ్రామాలు, వ్యవసాయ రంగమే కీలకంగా నిలుస్తాయని అన్నారు. రైతులు పటిష్ఠంగా ఉంటే ఆత్మనిర్భర్ భారత్​ పునాది పటిష్ఠంగా ఉంటుందని పేర్కొన్నారు.

మన్​కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు మోదీ. సాంకేతికతను వినియోగించుకుంటే దేశ వ్యవసాయ రంగం విశేషంగా అభివృద్ధి సాధిస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. జాతిపిత మహాత్మ గాంధీ ఆర్థిక విధానాలను అనుసరించి ఉంటే.. ఇప్పుడు ఆత్మ నిర్భర్‌ భారత్ ప్రచారం చేయాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదన్నారు.

కథలు చెప్పండి

భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించుకోనున్న నేపథ్యంలో దేశం కోసం పోరాటం చేసిన యోధుల గాథలను చిన్నారులకు కథలుగా చెప్పాలని సూచించారు. ముఖ్యంగా 1857 నుంచి 1947 మధ్య జరిగిన పరిణామాలను కథల రూపంలో తీసుకురావాలని కోరారు. కొత్త తరానికి చరిత్రను కథల రూపంలో అందించాలని పేర్కొన్నారు. భారత్​లో కథలకు పురాతన చరిత్ర ఉందని పేర్కొన్నారు మోదీ.

"కథల చరిత్ర పురాతనమైనది. మానవ చరిత్ర ఉన్నప్పటి నుంచి కథలు ఉన్నాయి. ఎక్కడైతే ఆత్మ ఉంటుందో అక్కడ కథ ఉంటుంది. భారత్​లో కథలు చెప్పడాన్ని గొప్ప సంప్రదాయంగా భావిస్తారు. పంచతంత్ర, హితోపదేశ వంటి కథలకు జీవం పోసిన ప్రాంతంలో మనం ఉండటం గర్వకారణం."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

నాలుగేళ్ల క్రితం భారత సైనికుల శౌర్య, పరాక్రమాలను ప్రపంచం వీక్షించిందని లక్షిత దాడులను ఉద్దేశించి మోదీ పేర్కొన్నారు. భారతమాత కీర్తి, ప్రతిష్ఠలను కాపాడటం ఒక్కటే సైనికుల ప్రధాన లక్ష్యంగా ఉందన్నారు. కరోనా సంక్షోభ పరిస్థితులు కుటుంబం మధ్య బంధాన్ని మరింత పెంపొందించడంలో దోహదపడ్డాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

అదే సమయంలో ప్రతిఒక్కరూ మాస్కు ధరించాలని అభ్యర్థించారు మోదీ. రెండు గజాల దూరం మిమ్మల్ని, మీ కుటుంబాలను కాపాడుతుందని అన్నారు. కరోనాకు మందు వచ్చే వరకు నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.