రైతు నాయకుడు రాకేశ్ టికాయత్ భావోద్వేగ ప్రసంగం రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది రైతులను చైతన్యపరిచిందని, స్ఫూర్తి నింపిందని హరియాణా రైతులు తెలిపారు. దీంతో మరోసారి ఆందోళనలకు సిద్ధమైనట్టు తెలిపారు. హరియాణాలోని అనేక జిల్లాల నుంచి దిల్లీకి పయనమయ్యారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంత వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఆహార సామగ్రితో..
హిసార్ జిల్లాలోని నార్నంద్, రాజ్‌తల్ గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు కనీసం 6 నెలలకు సరిపడా ఆహార సామగ్రితో దిల్లీ సరిహద్దులకు బయలుదేరారు.
రైతు ఉద్యమాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ కుట్రలకు రైతులు భయపడరు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించే వరకు ఉద్యమం కొనసాగుతుంది.
-రైతులు
ఇదీ చదవండి: ట్రాక్టర్ ర్యాలీలో హింసపై కీలక ఆధారాలు సేకరణ!