దేశవ్యాప్తంగా చక్కా జామ్(రాస్తారోకో) ఉద్ధృతంగా కొనసాగుతోంది. రైతులంతా పెద్ద ఎత్తున రహదారులపైకి చేరుకొని నిరసనలు చేపట్టారు. పంజాబ్లో రైతులు రోడ్లను దిగ్బంధించారు. అమృత్సర్, మొహలీ వంటి ప్రధాన నగరాల్లో రోడ్లపై బైఠాయించి నిరసనలు చేశారు రైతులు. దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ మినహా దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగారు రైతులు.
రాజస్థాన్-హరియాణా సరిహద్దులోని షాజహాన్పుర్ జాతీయ రహదారిని రైతులు దిగ్బంధించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చక్కా జామ్ ముగియగానే ఒక నిమిషం పాటు హారన్లు మోగిస్తామని రైతు నేతలు తెలిపారు.
అరెస్టు
బెంగళూరు యలహంక పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనలు చేస్తున్న రైతులను నిర్బంధించారు పోలీసులు. నిరసనకారులను బస్సుల్లో తరలించారు. దిల్లీలో ఆందోళన చేస్తున్న పలువురు నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు.
చక్కా జామ్ నేపథ్యంలో దిల్లీలోని పలు మెట్రో స్టేషన్లకు హైఅలర్ట్ జారీ చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లోని స్టేషన్లను మూసివేశారు. మండీ హౌస్, ఐటీఓ, దిల్లీ గేట్, ఎర్రకోట, జామా మసీదు స్టేషన్ల ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలను మూసేశారు.
భద్రత కట్టుదిట్టం
చక్కా జామ్ నేపథ్యంలో దిల్లీ సహా అన్ని రాష్ట్రాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. దిల్లీలో జనవరి 26 తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని సీపీ ఆలోక్ కుమార్ తెలిపారు. దేశ రాజధానిలో భద్రతను పర్యవేక్షించడానికి డ్రోన్లను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. సున్నితమైన ప్రాంతాల్లో సీసీటీవీలు అమర్చినట్లు స్పష్టం చేశారు.
-
#WATCH: Heavy security deployment at Ghazipur border (Delhi-Uttar Pradesh), in view of protests against the farm laws.
— ANI (@ANI) February 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
(Video source: Delhi Police) pic.twitter.com/yyQGSj393R
">#WATCH: Heavy security deployment at Ghazipur border (Delhi-Uttar Pradesh), in view of protests against the farm laws.
— ANI (@ANI) February 6, 2021
(Video source: Delhi Police) pic.twitter.com/yyQGSj393R#WATCH: Heavy security deployment at Ghazipur border (Delhi-Uttar Pradesh), in view of protests against the farm laws.
— ANI (@ANI) February 6, 2021
(Video source: Delhi Police) pic.twitter.com/yyQGSj393R
యూపీలో రాష్ట్ర, జాతీయ రహదారుల వెంబడి భద్రత పటిష్ఠం చేశారు. 6 పారామిలిటరీ కంపెనీలు, 144 యూపీ-పీఏసీ కంపెనీల సిబ్బందిని మోహరించినట్లు యూపీ అదనపు డీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. డ్రోన్ల ద్వారా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి కదలికను రికార్డు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: 'దేశ హితం కోసం వారు సత్యాగ్రహం చేస్తున్నారు'