ETV Bharat / bharat

భారత్​ బంద్​: వ్యవసాయ బిల్లులపై రైతన్న పోరు​ - వ్యవసాయ బిల్లులపై నిరసనలు

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా.. నేడు భారత్​ బంద్​కు పిలుపునిచ్చారు రైతులు. కాంగ్రెస్​తో పాటు వివిధ సంస్థలు ఈ బంద్​కు మద్దతు ప్రకటించాయి. పంజాబ్​లో బంద్​ ప్రభావం ఎక్కువగా కనపడే అవకాశాలున్నాయి. రోడ్లను దిగ్బంధించడం సహా వివిధ రకాలుగా నిరసనలు తెలపడానికి అన్నదాతలు సన్నద్ధమవుతున్నారు.

Farmers call for Bharat Bandh on Friday against farm bills
వ్యవసాయ బిల్లులకు నిరసనగా నేడు భారత్​ బంద్​
author img

By

Published : Sep 25, 2020, 4:58 AM IST

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ.. శుక్రవారం భారత్​ బంద్​కు పిలుపునిచ్చాయి దేశంలోని వివిధ రైతు సంఘాలు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ఆందోళనలకు రైతులు సన్నద్ధమవుతున్నారు.

అన్నదాతలు చేపట్టిన భారత్​ బంద్​కు కాంగ్రెస్​ మద్దతు ప్రకటించింది. లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు.. రైతులకు అండగా నిలుస్తారని పేర్కొంది. రైతులకు హాని కలిగించే బిల్లులను కేంద్రం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేసింది.

ఆ రాష్ట్రాల్లో...

పంజాబ్​, హరియాణాలో భారత్​ బంద్​ ప్రభావం ఎక్కువగా కనపడే అవకాశాలు ఉన్నాయి. రైల్​రోకోతో ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో నిరసనలు తారస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం పంజాబ్​ బంద్​కు పిలుపునిచ్చారు ఆ రాష్ట్ర రైతులు. వీరికి హరియాణా రైతులతో పాటు 31 రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి.

బీకేయూ(భారతీయ కిసాన్​ యూనియన్​) సహా హరియణాలోని అనేక సంస్థలు రైతులతో చేతులు కలిపాయి. నిరసనలకు ప్రజలు మద్దతు తెలపాలని బీకేయూ అభ్యర్థించింది. నిరసనల్లో భాగంగా రోడ్లను దిగ్బంధించనున్నట్టు ప్రకటించింది శిరోమణి అకాలిదళ్​.

'అలా చేయకండి...'

భారత్​ బంద్​ పేరుతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు పంజాబ్​ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​. కరోనా నిబంధనలను పాటిస్తూనే నిరసనలు తెలపాలని కోరారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం కూడా రైతులతోనే ఉన్నట్టు స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో అమల్లో ఉన్న 144సెక్షన్​ను ఉల్లంఘించే వారిపై ఎలాంటి చర్యలు చేపట్టమని పేర్కొన్నారు.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.