ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూలో నకిలీ శానిటైజర్ ముఠా గుట్టు రట్టయింది. కరోనా వైరస్ నియంత్రణ కోసం చేతులను శుభ్రంగా ఉంచుకోవాలన్న ప్రభుత్వ సూచనలతో దేశవ్యాప్తంగా శానిటైజర్లకు గిరాకీ పెరిగింది. ఈ డిమాండ్‌ను సొమ్ము చేసుకోవాలని భావించిన ఓ ఔషధ ముఠా నకిలీ శానిటైజర్లను తయారుచేసి మార్కెట్లోకి పంపిణీ చేసింది. దీనిని గుర్తించిన అధికారులు ఫ్యాక్టరీపై దాడి చేసి సీజ్ చేశారు.
లఖ్‌నవూలోని మహాలక్ష్మీ కెమికల్స్ ఫ్యాక్టరీ.. మార్కెట్లో శానిటైజర్లకు ఉన్న డిమాండ్‌ను గుర్తించి నకిలీ తయారీకి తెరతీసింది. ఈ నేపథ్యంలో మార్కెట్లో అందుబాటులో ఉన్న శానిటైజర్లు నకిలీవిగా గుర్తించిన అధికారులు ఫ్యాక్టరీపై దాడి చేశారు. 10వేల నకిలీ బాటిళ్లను స్వాధీనం చేసుకుని.. ఫ్యాక్టరీని సీజ్ చేశారు. యజమానిపై డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: త్వరలో ప్రైవేటు ల్యాబ్‌ల్లోనూ కరోనా పరీక్షలు