ETV Bharat / bharat

రజనీకాంత్​కు బాంబు బెదిరింపు అతడి పనే!

సూపర్​స్టార్​ రజనీకాంత్​ ఇంట్లో బాంబు ఉందని ఫేక్​ కాల్ చేసిన వ్యక్తిని తమిళనాడు పోలీసులు గుర్తించారు. అతను ఎనిమిదో తరగతి చదువుతున్న బాలుడని తేల్చారు. మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న అతడిని వైద్య రికార్డులు పరిశీలించిన అనంతరం వదిలిపెట్టారు.

Fake bomb threat issued to Rajinikanth: Police trace caller
రజనీకాంత్​ ఇంట్లో బాంబు ఉందని కాల్​ చేసింది బాలుడట
author img

By

Published : Jun 19, 2020, 6:20 PM IST

అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌ ఇంట్లో బాంబు ఉందంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి చేసిన ఫోన్‌ కారణంగా చెన్నై పోలీసులు గురువారం ఉరుకులు పరుగులు పెట్టారు. అది ఫేక్​ అని తెలిశాక కాల్​ చేసిన వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. కడలూర్​ జిల్లా సమీపంలోని నెల్లికుప్పంకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి ఈ పని చేసినట్లు గుర్తించారు.

బాలుడు మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడని పోలీసులకు తెలిసింది. వైద్య రికార్డులు పరిశీలించిన అనంతరం అతడిని వదిలిపెట్టారు.

ఇదీ జరిగింది..

గురువారం మధ్యాహ్నం 108 నెంబర్‌కు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి రజనీకాంత్‌ ఇంట్లో బాంబు ఉందని చెప్పాడు. వెంటనే హుటాహుటిన రజనీ ఇంటికి చేరుకున్నారు పోలీసులు. అయితే కరోనా నేపథ్యంలో వారిని ఇంట్లోకి అనుమతించలేదు. 10 నిమిషాల పాటు వేచి చూశారు. సెక్యూరిటీ గార్డ్​ క్యాబిన్​, రజనీ ఇంటి చుట్టూ ముమ్మర తనిఖీలు చేపట్టి వెనుదిరిగారు.

ప్రస్తుతం రజనీకాంత్‌ శివ దర్శకత్వంలో ‘అన్నాత్తే’ చిత్రంలో నటిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా షూటింగ్‌ వాయిదా పడింది. కీర్తిసురేశ్‌, ఖుష్భూ, మీనా, కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్‌ పూర్తి చేసి, సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం భావించింది. లాక్‌డౌన్‌ కారణంగా చిత్రీకరణ తాత్కాలికంగా ఆగిపోయినందున సినిమా విడుదల మరింత ఆలస్యం కానుంది.

ఇదీ చూడండి: లేహ్​, లద్దాఖ్​ సరిహద్దులో యుద్ధ విమానాలతో గస్తీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.