ETV Bharat / bharat

'పక్షపాతంగా వ్యవహరించం- హింసను సమర్థించం'

భాజపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలను ఫేస్​బుక్​ ఖండించింది. పక్షపాత రహితంగా వ్యవహరిస్తామని, ఏ రూపంలో ఉన్నా ద్వేషాన్ని, మతదురాభిమానాన్ని ఖండిస్తామని స్పష్టం చేసింది​. రాజకీయ పక్షపాతం చూపుతున్నారని కాంగ్రెస్​ చేసిన ఆరోపణలను తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు.

Facebook responds to Cong's charge of political bias, says it is non-partisan and denounces hate
పక్షపాత రహితంగా వ్యవహరిస్తాం- ఫేస్​బుక్​
author img

By

Published : Sep 3, 2020, 7:29 PM IST

రాజకీయ పక్షపాతం చూపుతున్నారని, భారత ప్రజాస్వామ్య ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్నారని కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్‌ స్పందించింది. తాము పక్షపాతరహితంగా ఉంటామని, ఏ రూపంలో ఉన్నా ద్వేషాన్ని, మత దురాభిమానాన్ని ఖండిస్తామని స్పష్టం చేసింది. తమ సామాజిక మాధ్యమ వేదికలపై ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్పుకోవచ్చని తెలిపింది.

తీవ్రంగా పరిగణిస్తాం...

రాజకీయ పక్షపాతం చూపుతున్నారని కాంగ్రెస్‌ చేసిన ఆరోపణలను తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ఫేస్‌బుక్‌ పబ్లిక్‌ పాలసీ, ట్రస్ట్‌, సేఫ్టీ డైరెక్టర్‌ నీల్‌ పాట్స్‌ వెల్లడించారు. పక్షపాతరహితంగా, వివాదాలకు తావివ్వకుండా అత్యున్నత స్థాయి విలువలకు సంస్థ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.

ద వాల్‌స్ట్రీట్ జర్నల్‌, టైమ్​ మ్యాగజైన్​లోని ప్రచురితమైన కథనాలను ప్రస్తావిస్తూ.. 'ఫేస్​బుక్, వాట్సాప్​ అధికార భాజపా నేతలు విద్వేషపూరిత ప్రసంగాలను చూసీచూడనట్లు వదిలేస్తున్నాయి'​ అని ఫేస్​బుక్​ సీఈఓ మార్క్ జూకర్​బర్గ్​కు లేఖ రాసింది కాంగ్రెస్​.

ఇదీ చూడండి: వివాదంలో బుక్కైన ఫేస్‌బుక్‌.. అసలేంటీ రగడ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.