కర్ణాటక రాజధాని బెంగళూరుతో పాటు హుబ్లీ-ధార్వాడ్, కలబురగి, రాయ్చుర్, చిత్రదుర్గ, మంగళూరు, దవాంగీర్, ఉడుపి, మైసూర్, తుమకూరు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించారు.
ఉగ్రవాద బృందాలు దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులకు దిగి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయని అధికారులు తెలిపారు.
తనిఖీల సందర్భంగా మంగళూరులో ఎనిమిది మంది దోపిడీ దొంగలను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి రెండు తుపాకులు, ఎనిమిది కార్ట్రిడ్జ్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి: రెండో పెళ్లి వద్దన్నారని 75ఏళ్ల వరుడి ఆత్మహత్య