ETV Bharat / bharat

నిర్భాగ్యులకు వసతి కల్పించండి: కేంద్రం - దేశంలో లాక్​డౌన్

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో దిల్లీ సహా ప్రధాన నగరాల నుంచి వలస కూలీలు భారీగా స్వస్థలాలకు వెళ్తున్న వేళ స్థానికంగానే వసతులు కల్పించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. నిర్భాగ్యులకు ఆహారం, దుస్తులు, వసతి కల్పించాలని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది.

north block
కేంద్ర ప్రభుత్వం
author img

By

Published : Mar 29, 2020, 5:25 AM IST

కరోనా వైరస్‌ కట్టడికి కేంద్రం 21 రోజులపాటు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ప్రకటించగా వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి, కష్టాల్లో పడ్డారు. ఉన్నచోట ఉపాధి లేక సొంత ప్రాంతాలకు పయనమవుతున్నారు. దిల్లీలోని ఉత్తర్​ప్రదేశ్‌ వాసులు, ముంబయిలో ఉన్న గుజరాత్‌ వాసులు సొంత ఊళ్ల బాటపట్టారు. వందల కిలోమీటర్ల దూరమైనప్పటికీ కాలినడకనే పయనం సాగిస్తున్నారు.

వలస కూలీలు సొంత ప్రాంతాలకు వెళ్లే క్రమంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉండటం వల్ల కేంద్రం అప్రమత్తమైంది. తక్షణమే సహాయక శిబిరాలు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. వారందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని సూచించింది. వలస కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలను వారికి తెలియజేయాలని కోరింది. ఇందుకోసం వలంటీర్లు, ఎన్​జీఓల సేవలను ఉపయోగించుకుని పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని సూచించింది.

అండగా ఉంటాం

ఆయా రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలకు తక్షణం ఆహారం, దుస్తులు, వసతి సదుపాయాలు కల్పించాలని రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. రహదారులపై సహాయక శిబిరాలను ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ మేరకు వలస కార్మికులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. 21 రోజుల లాక్​డౌన్ సమయంలో అన్నివిధాల సాయం అందిస్తామని తెలిపారు.

కూలీల కోసం విపత్తు నిధులు

వలస కూలీలను ఆదుకునేందుకు విపత్తు ప్రతిస్పందన నిబంధనలను కేంద్ర హోంశాఖ సవరించింది. రాష్ట్రాలకు అందించే విపత్తు స్పందన నిధులను వలస కూలీల కోసం ఉపయోగించుకునేందుకు అనుమతి ఇచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరం కోసం ఇప్పటికే రూ.29,000 కోట్ల నిధులను కేంద్రం కేటాయించింది. ఈ నిధులను లాక్‌డౌన్‌ కాలంలో ఉపాధి కోల్పోయిన వలస కార్మికుల వైద్య, తాత్కాలిక వసతి కల్పించేందుకు వినియోగించవచ్చని హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య శ్రీవాస్తవ తెలిపారు. ఈ కొత్త నిబంధనలు వలస కూలీలతోపాటు నిరాశ్రయులకు వర్తిస్తాయని చెప్పారు.

సొంత ఊళ్లకు వెళ్లేందుకే మొగ్గు..

ఆయా రాష్ట్రప్రభుత్వాలు వలస కూలీలకు ఆహార భద్రత కల్పిస్తామని ప్రకటించినప్పటికీ, కూలీలు మాత్రం సొంత ఊళ్లకు వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు. శుక్రవారం రాత్రి దిల్లీ-యూపీ సరిహద్దు ఘజియాబాద్ వద్దకు వేలాదిగా చేరుకున్న వలస కూలీలను పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి తీవ్రతను గమనించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 24 గంటలకుపైగా నుంచి వేచివున్న కూలీలను ఇళ్లకు చేర్చేందుకు 1000 బస్సులను దిల్లీ-యూపీ సరిహద్దులకు పంపింది. ఘజియాబాద్, నోయిడాలోని వలస కూలీలను సొంత ప్రాంతాలకు తరలిస్తోంది.

రాజస్థాన్ ప్రభుత్వం సైతం వలస కూలీలను తరలించేందుకు ముందుకొచ్చింది. రోడ్డు మార్గం ద్వారా వారిని స్వస్థలానికి చేరుస్తామని తెలిపింది. జిల్లా కలెక్టర్ల సిఫార్సుల మేరకు బస్సులను ఆయా రాష్ట్రాలకు తరలిస్తామని పేర్కొంది.

కాలినడకలో ప్రమాదాలు

కాలినడకన స్వరాష్ట్రాలకు వెళ్తున్న వలస కూలీలు ప్రమాదాల బారిన పడుతున్నారు. ముంబయి నుంచి గుజరాత్‌కు వెళ్తున్న నలుగురు కూలీలు పాల్ఘడ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. వెనుక నుంచి టెంపో ఢీ కొనడం వల్ల అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

శ్రద్ధ చూపండి

స్వస్థలాలకు తరలి వెళ్తున్న వలస కార్మికులపై శ్రద్ధ వహించాలని దేశంలోని 200 మంది విద్యావేత్తలు, ఆర్థిక వేత్తలు, సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. అంగన్వాడీ, పంచాయతీ భవనాలు, కళాశాలలు, రైల్వే స్టేషన్లను వలస కార్మికుల వసతి కోసం ఉపయోగించుకోవాలని సూచించారు. లక్షలాది మందిని ప్రమాదంలో పడేసిన ఈ పరిస్థితిని జాతీయ విపత్తుగా అభివర్ణించారు. తక్షణమే వారందరినీ ఆదుకోవాలని కోరారు.

వివిధ రాష్ట్రాల్లో లాక్​డౌన్

మరోవైపు లాక్​డౌన్​ సమయంలో ప్రజలు నిబంధనలు అతిక్రమిస్తున్న దాఖలాలు కనిపిస్తూనే ఉన్నాయి. అసోంలోని బొంగైగావ్ జిల్లాలో​ ఆంక్షలను లెక్కచేయకుండా పెద్ద ఎత్తున ప్రజలు మార్కెట్లకు బారులు తీరారు. నిబంధనలు పాటించాలన్న భద్రత అధికారులపై దాడికి పాల్పడ్డారు. దీంతో మార్కెట్లో గుమిగూడిన ప్రజలను చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు.

లాక్​డౌన్​ను అతిక్రమించినందుకు దిల్లీలో 82 కేసులు నమోదు చేయగా... 3,485 మందిని నిర్బంధించారు. ఆంక్షలను ఉల్లంఘించిన వారిని శిక్షించడానికి వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు రాజస్థాన్ ఝుంఝనూ జిల్లా అధికారులు. క్వారంటైన్ వార్డుల్లో ఉన్న వారి బాగోగులు చూసుకోవడానికి వారిని తరలిస్తున్నారు. వీధుల్లోకి పెద్ద ఎత్తున చేరుకోకుండా ప్రజలపై నిఘా ఉంచేందుకు డ్రోన్లు వినియోగిస్తున్నారు కేరళ పోలీసులు.

ఇదీ చదవండి: కరోనా ఎలా ఉంటుందో తెలుసా?.. ఈ చిత్రాల్లో చూడండి

For All Latest Updates

TAGGED:

Lockdown
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.