సరిహద్దుల్లో అన్ని సీజన్లలోనూ తన సైన్యం రాకపోకలకు అవరోధాలు లేకుండా చేసుకునేందుకు చైనా భారీ ప్రాజెక్టులను అమలు చేస్తోంది. 2017లో భారత్-చైనా సైనికులు ముఖాముఖి తలపడి 70 రోజుల పాటు ప్రతిష్టంభన కొనసాగిన డోక్లామ్ పీఠభూమిలో సొరంగ మార్గాలను డ్రాగన్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన 2019 ఆగస్టు నాటి ఉపగ్రహ ఛాయాచిత్రాలు తమకు లభించినట్లు ఎన్డీటీవీ తాజాగా వెల్లడించింది.
అత్యంత ఎత్తైన మెరుగ్ కనుమ మార్గంలో అప్పటికే ఉన్న రహదారిపై చైనా కార్మికులు కప్పు వంటి నిర్మాణం చేపట్టడం ద్వారా దానిని సొరంగంగా మార్చుతున్నట్లు చిత్రాల ద్వారా తెలుస్తోంది. 2017 నాటి డోక్లామ్ ఘటన తర్వాత నుంచి ఈ పనులను చైనా ముమ్మరం చేసింది. మంచు విపరీతంగా కురిసే శీతాకాలంలోనూ సైనికుల రాకపోకలకు అవరోధాలు కలగకూడదనే ఉద్దేశంతోనే చైనా వీటిని నిర్మిస్తోందని సైనిక నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: విడాకులు తీసుకోనున్న ట్రంప్ దంపతులు!