ETV Bharat / bharat

'అధికార పార్టీ వైఖరిని చూసి బంగాల్​ సిగ్గుపడుతుంది' - JP Nadda convoy attack latest

బంగాల్​లో జేపీ నడ్డా కాన్వాయ్​పై దాడి నేపథ్యంలో దీదీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు భాజపా సీనియర్​ నేత కైలాస్​ విజయవర్గీయ. పక్కా ప్రణాళికతో సీఎం మమతా బెనర్జీ, తృణమూల్​ కాంగ్రెస్​ నేతలే ఈ దాడికి కుట్ర పన్నారని ఈటీవీ భారత్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు విజయవర్గీయ. అంఫన్ తుపాన్​ నిధుల పంపణీలోనూ అక్రమాలు జరిగాయన్నారు.

EXCLUSIVE: Bengal is ashamed of TMC's, police attitude, says Kailash Vijayvargiya
'అధికార పార్టీ వైఖరిని చూసి బంగాల్​ సిగ్గుపడుతుంది'
author img

By

Published : Dec 11, 2020, 7:37 PM IST

రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్​ పార్టీ(టీఎంసీ), రాష్ట్ర పోలీసుల వైఖరిని చూసి బంగాల్​ ప్రజలు సిగ్గుపడుతున్నారని భాజపా సీనియర్​ నాయకుడు కైలాస్​ విజయవర్గీయ అన్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్​పై దాడి వెనుక ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, టీఎంసీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి దాడులు జరగడం దురదృష్టకమన్నారు.

'అధికార పార్టీ వైఖరిని చూసి బంగాల్​ సిగ్గుపడుతుంది'

'అంఫన్​ నిధుల్లో అక్రమాలు'

అంఫన్​ బాధితుల సహాయార్థం కేంద్రం అందించిన నిధులు.. మత్స్యకారులకు అందాయా?లేదా? అనే విషయాన్ని అడగడానికి వెళ్తున్న నడ్డా కాన్వాయ్​పై పక్కా ప్రణాళికతోనే మమత ఈ దాడి చేయించారని ఈటీవీ భారత్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయవర్గీయ పేర్కొన్నారు. అంఫన్​ తుపాను బాధితులకు కేంద్రం రూ.2,200 కోట్ల నిధులు కేటాయించిందన్న కైలాస్​.. పంపిణీలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. "ఆ డబ్బు బాధితులకు అందలేదు. టీఎంసీ కార్యకర్తల జేబుల్లోకి వెళ్లింది. ఆ నిధులపై పంపిణీపై హైకోర్టు కూడా నివేదిక కోరింది" అని కైలాస్​ చెప్పారు.

'అసలు అవి ఇక్కడ లేవు'

రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి అడగగా.. "ఇక్కడ అసలు శాంతిభద్రతలు లేవు. కొంతమంది క్రిమినల్స్​ సివిల్​ దుస్తులు ధరిస్తారు. మరికొందరు పోలీసు దుస్తుల్లో కనిపిస్తారు. తేడా లేదు. పోలీసుల సమక్షంలో టీఎంసీ పార్టీ కార్యకర్తల పోకిరి చేష్టలను ప్రజలు గమనిస్తున్నారు. వారికి ముఖ్యమంత్రి వత్తాసు పలుకుతున్నారు. మమతకు సీఎంగా కొనసాగే హక్కులేదు. తొందరలోనే బంగాల్​ ప్రజలు.. మమతకు తగిన బుద్ది చెబుతారు." అని అన్నారు వర్గీయ.

ఇదీ చూడండి: కేంద్రం చర్యలు రాజ్యాంగవిరుద్ధం: టీఎంసీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.