నవ భారత నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమన్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. శక్తిమంతమైన, సుదృఢ, సమృద్ధికరమైన భారత్‌ను నిర్మించేందుకు ముందుకు సాగుతున్నామని పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశం వేదికగా వ్యాఖ్యానించారు.
జులై 5న పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల అనంతర తొలి పార్లమెంట్ సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించారు కోవింద్.
17వ లోక్‌సభకు నూతనంగా ఎన్నికైన సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు కోవింద్. శాంతియుతంగా ఎన్నికల క్రతువును నిర్వహించిన ఎన్నికల సంఘాన్ని అభినందించారు. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో ఉండే అన్ని సౌకర్యాలు గ్రామాలకూ విస్తరించాలని ఉద్ఘాటించారు.
"సబ్‌కా సాత్- సబ్‌కా వికాస్- సబ్‌కా విశ్వాస్" ప్రభుత్వ నినాదం అని వెల్లడించారు రాష్ట్రపతి. స్వచ్ఛభారత్ తరహాలో నీటిసంరక్షణ ఉద్యమం చేపడతామన్నారు. రహదారులపై బహిరంగ మల, మూత్ర విసర‌్జన లేకుండా పరిశుభ్ర భారతం నిర్మించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేయనుందని స్పష్టం చేశారు.
పేదరిక నిర్మూలనకు కేంద్రం పాటుపడుతుందన్నారు.
"ఏ విధమైన భేదభావాలు లేకుండా పనిచేస్తూ ప్రభుత్వం నవభారత నిర్మాణం దిశగా ముందుకెళ్తోంది. గత ఐదేళ్లలో ప్రభుత్వం తమ భవిష్యత్తును మెరుగుపరుస్తుందన్న, జీవన ప్రమాణాలను పెంచుతోందన్న విశ్వాసం దేశ ప్రజల్లో నెలకొంది. దేశంలోని ప్రతి వ్యక్తినీ సశక్తీకరించడం ప్రభుత్వ ముఖ్య లక్ష్యం. దేశ ప్రజల మౌలిక అవసరాలను పూర్తి చేస్తూనే.. ప్రభుత్వం శక్తిమంతమైన, సురక్షితమైన, సమృద్ధికరమైన భారత నిర్మాణం దిశగా అడుగులు వేస్తోంది. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్ అనే నినాదంతో ముందుకుసాగుతున్నాం."
-రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఇదీ చూడండి: నిర్లక్ష్యంతో ఇలా రైలు కింద పడ్డాడు