ETV Bharat / bharat

దిల్లీ ఘర్షణల కేసులో ఉమర్ ఖలీద్ అరెస్టు

దిల్లీ ఘర్షణల కేసులో జేఎన్​యూ మాజీ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్​ను పోలీసులు అరెస్టు చేశారు. 11 గంటల పాటు విచారించి అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు న్యాయ స్థానంలో హాజరుపర్చనున్నట్లు వెల్లడించారు.

Ex-JNU student leader Umar Khalid arrested in connection with northeast Delhi riots
దిల్లీ ఘర్షణల కేసులో ఉమర్ ఖలీద్ అరెస్టు
author img

By

Published : Sep 14, 2020, 5:27 AM IST

దిల్లీ ఘర్షణలతో సంబంధం ఉందన్న ఆరోపణలతో జవహార్​లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ మాజీ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖలీద్​ను 11 గంటలపాటు విచారించిన తర్వాత దిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం ఆదివారం రాత్రి అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఖలీద్​ను ఇవాళ న్యాయస్థానంలో హాజరుపర్చనున్నట్లు వెల్లడించారు.

అల్లర్లతో సంబంధం ఉందన్న అనుమానాలతో ఖలీద్​ను సెప్టెంబర్ 2న దిల్లీ పోలీసు క్రైం బ్రాంచ్ రెండు గంటల పాటు విచారించింది. ఘర్షణలకు సంబంధించి ఓ కేసులో ఖలీద్​పై చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం ప్రకారం ఇదివరకే కేసు నమోదైంది. ఘర్షణలో కుట్రకోణంపై దిల్లీ పోలీసు ప్రత్యేక సెల్ ఖలీద్​ను ప్రశ్నించింది. అతని సెల్​ఫోన్​ను స్వాధీనం చేసుకుంది.

హింస

ఈశాన్య దిల్లీలో ఫిబ్రవరి 24న హింసాత్మక ఘర్షణ చెలరేగింది. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య జరిగిన ఈ ఘర్షణలో 53 మంది మరణించారు. మరో 200 మందికిపైగా గాయపడ్డారు. హింసాత్మక నిరసనలను అడ్డుకునే క్రమంలో ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోగా.. 108 మంది గాయపడ్డారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.