ETV Bharat / bharat

వరద నుంచి చిన్నారిని కాపాడిన ఈటీవీ భారత్ రిపోర్టర్

బిహార్​ గోపాల్​గంజ్ జిల్లా విష్ణుపురలో వరదల్లో చిక్కుకున్న ఓ చిన్నారిని వెన్నుపై మోసి సురక్షిత ప్రాంతానికి చేర్చాడు ఈటీవీ భారత్ రిపోర్టర్. అనంతరం అతని ఇంటికి తీసుకెళ్లి ఆశ్రయం కల్పించి సహృదయాన్ని చాటుకున్నాడు.

ETV Bharat reporter carries child to safety through floodwaters in Bihar
వరద నుంచి చిన్నారిని కాపాడిన ఈటీవీ భారత్ రిపోర్టర్
author img

By

Published : Jul 31, 2020, 5:06 PM IST

వరద నుంచి చిన్నారిని కాపాడిన ఈటీవీ భారత్ రిపోర్టర్

బిహార్ గోపాల్​గంజ్​ జిల్లాలో వరద బీభత్సంపై వార్తలు సేకరించేందుకు వెళ్లిన ఓ ఈటీవీ రిపోర్టర్ తన సహృదయాన్ని చాటుకున్నాడు. జిల్లాలోని విష్ణుపుర గ్రామం పూర్తిగా నీటమునిగిన నేపథ్యంలో ఛాతీ లోతు ఉన్న నీటిలో ఓ బాలుడిని వీపుపై ఎక్కించుకుని తన స్వగృహానికి తీసుకెళ్లాడు.

క్షేత్రస్థాయిలో వరద పరిస్థితిపై వార్తలు సేకరించేందుకు వెళ్లిన రిపోర్టర్ అటల్ బిహారీ పాండే ఈ సాహసం చేశాడు.

అయితే గ్రామాన్ని పూర్తిస్థాయిలో వరద ముంచెత్తిన నేపథ్యంలో అక్కడివారికి ఉండేందుకు చోటు లేకుండా పోయిందని సమాచారం. ఇప్పటివరకు ఏ అధికారి కూడా గ్రామాన్ని సందర్శించలేదని బాధితులు చెబుతున్నారు. బిహార్​లో 40లక్షలమందిపై వరదల ప్రభావం పడింది.

ఇదీ చూడండి: ఆగస్టు 1న ఆన్​లైన్​ 'హ్యాకథాన్'లో ప్రధాని ప్రసంగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.