లాక్‌డౌన్ ప్రభావంతో దేశవ్యాప్తంగా రక్తనిధి కేంద్రాల్లో నిల్వలు నిండుకున్నాయి. దీంతో రక్తం అవసరమైన రోగులకు సకాలంలో అందక శస్త్రచికిత్సలు వాయిదా పడుతున్నాయి. రక్తదాతలు సిద్ధంగా ఉన్నా కేంద్రాల వరకు వెళ్లలేకపోతున్నారు. ఈ పరిస్థితిని ఈనెల12న 'ఈటీవీ- భారత్' ప్రముఖంగా వెలుగులోకి తీసుకొచ్చింది. స్పందించిన వారణాసిలోని సర్ సుందర్‌లాల్ ఆసుపత్రి... మొబైల్ బ్లడ్‌బ్యాంకును ప్రారంభించింది. నగరమంతా తిరుగుతూ దాతల నుంచి రక్త సేకరణ ప్రారంభించింది. పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పార్టీల నాయకులు సహకరిస్తున్నారు. రక్తదాతలు భౌతిక దూరం పాటిస్తున్నారు. 'ఈటీవీ-భారత్' యాప్‌లో కథనం చూశాక తాము మొబైల్ బ్లడ్‌బ్యాంకుకు ఫోన్ చేసి తమ కాలనీని పిలిపించామని, స్థానికులకు ప్రోత్సహించి రక్తదానం చేయించామని వానప్రస్థ స్వచ్ఛంద సంస్థ వాలంటీర్ రాకేశ్ మిద్దా చెప్పారు.
ఇదీ చూడండి: క్రమంగా తగ్గుముఖం పడుతున్న కరోనా వ్యాప్తి!