ఈఎస్ఐ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు కేంద్రం శుభవార్త తెలిపింది. ఆరోగ్య బీమాకు సంబంధించి ఉద్యోగుల సభ్యత్వ రుసుంను తగ్గించింది. ఈఎస్ఐ చట్టం కింద ఉద్యోగుల నుంచి వసూలు చేసే మొత్తాన్ని 6.5 నుంచి 4 శాతానికి తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. సభ్యత్వ రుసుంలో ఉద్యోగి వాటాను 1.74 నుంచి 0.75కి, యాజమాన్య వాటాను 4.75 నుంచి 3.25 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
సవరించిన రుసుంలు ఆగస్టు 1నుంచి అమల్లోకి వస్తాయని కార్మిక శాఖ తెలిపింది. ఈ నిర్ణయం వల్ల 3 కోట్ల 60 లక్షల మంది ఉద్యోగులు, 12 లక్షల 86 వేల మంది యజమానులకు రూ.5వేల కోట్ల మేర ఆదా కానుంది.
ఇదీ చూడండి: సముద్రంలో జవాన్‌ను కాపాడిన తీరప్రాంత దళం