ఒక అధ్యాపకుడు రెండు వేర్వేరు ఇంజినీరింగ్ విద్యా సంస్థల్లో బోధించడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టంచేసింది ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ). అలా పాఠాలు చెప్పిస్తున్న ఇంజినీరింగ్ కళాశాలలు, ఇతర సాంకేతిక విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
"కొన్ని విద్యాసంస్థలు తమ గ్రూపులోని కళాశాలలు, లేదా ఇతర కళాశాలల్లో ఒకే అధ్యాపకుడి చేత పాఠాలు చెప్పిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ఒక అధ్యాపకుడు ఒకేసారి రెండు వేర్వేరు విద్యా సంస్థల్లో బోధించడం నిషేధం. ఇలాంటి చర్యల వల్ల విద్యలో నాణ్యత తగ్గిపోవటమే కాకుండా, నియమ నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుంది. నిబంధనల ఉల్లంఘనపై ఫిర్యాదు అందితే విచారణ జరిపించి, కఠిన చర్యలు తీసుకుంటాం."
- ఏఐసీటీఈ
ఇదీ చూడండి: 8 రోజుల్లో 5 కీలక తీర్పులు ఇవ్వనున్న జస్టిస్ గొగొయి!