ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​ ఎన్​కౌంటర్​లో ఐదుగురు ఉగ్రవాదులు హతం - జమ్ముకశ్మీర్​

Encounter going on in sugoo handhama area of Shopian district
కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఓ ఉగ్రవాది హతం
author img

By

Published : Jun 10, 2020, 7:25 AM IST

Updated : Jun 10, 2020, 12:22 PM IST

11:42 June 10

జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఎన్​కౌంటర్​లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి భద్రతా బలగాలు. షోపియాన్​ జిల్లా సుగూ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కిఉన్నారన్న సమాచారంతో జమ్ముకశ్మీర్​ పోలీసులు, భద్రతా దళాలు సంయుక్త ఆపరేషన్​ చేపట్టాయి. వీరి రాకను ముందే పసిగట్టిన ముష్కరులు కాల్పులు జరపగా.. ఎన్​కౌంటర్​కు దారితీసింది. దీటుగా తిప్పికొట్టిన సిబ్బంది ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వీరు ఏ ముఠాకు చెందిన వారో తెలియాల్సి ఉంది. 

కొద్దిరోజులుగా షోపియాన్​లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. వరుసగా ఆపరేషన్​లు నిర్వహిస్తున్నాయి భద్రతా దళాలు. ఆదివారం రేబాన్​లో ఐదుగురిని, సోమవారం పింజోరాలో నలుగురిని హతమార్చాయి. నాలుగు రోజుల వ్యవధిలో మొత్తం 14 మంది ముష్కరులు మరణించారు. 

10:00 June 10

జమ్ముకశ్మీర్​ ఎన్​కౌంటర్​లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్​ జిల్లా సుగూ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కిఉన్నారన్న సమాచారంతో.. పోలీసులు, భద్రతా దళాలు సంయుక్తంగా ఆపరేషన్​ చేపట్టాయి. 

08:10 June 10

మరొకరు..

షోపియాన్​ జిల్లా సుగూలో జరుగుతోన్న ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి భద్రతా దళాలు. ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. 

07:20 June 10

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఓ ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్​ షోపియాన్​ జిల్లాలో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. ఇవాళ ఉదయం సుగూ ప్రాంతంలో భద్రతా దళాలు, ముష్కరుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్​కౌంటర్​లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

కొద్దిరోజులుగా కశ్మీర్​లో సైనిక దళాలు భారీ ఆపరేషన్​లను నిర్వహిస్తున్నాయి. 72 గంటల్లో 9 మంది హిజ్బుల్​ ఉగ్రవాదులను హతమార్చాయి.   

Last Updated : Jun 10, 2020, 12:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.