ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై మరోమారు విమర్శనాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ. ఉద్యోగం అనేది మనిషి గౌరవానికి సంబంధించినదని రాహుల్ అన్నారు. ఆ గౌరవాన్ని ప్రజలకు అందించడానికి మోదీ ప్రభుత్వం ఇంకెంత సమయం తీసుకుంటుందని ప్రశ్నించారు.
నిరుద్యోగ సమస్యకు సంబంధించిన ఓ మీడియా కథనాన్ని తన ట్వీట్‌కు జోడించారు రాహుల్.
"దేశంలో నిరుద్యోగ సమస్య భారీ స్థాయిలో ఉంది. ఫలితంగా ఈ రోజును యువత #నేషనల్అన్ఎంప్లాయిమెంట్డే అని పిలుస్తోంది. ఉద్యోగం అంటే గౌరవం. ప్రభుత్వం ఇంకెన్ని రోజుల పాటు ఆ గౌరవం ప్రజలకు దక్కకుండా చేస్తుంది?"
--- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత
ఆర్థికవ్యవస్థ, కరోనా సంక్షోభం, సరిహద్దు ఉద్రిక్తతలపై గత కొంతకాలంగా రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇవీ చూడండి:- 'కేంద్రం ప్రకటనతో గల్వాన్ వీరులకు అవమానం'