ETV Bharat / bharat

ఏనుగే ఆ బాంబు ఉన్న పండును ఆరగించిందా?

author img

By

Published : Jun 8, 2020, 12:32 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ ఏనుగు మృతి ఉదంతం కొత్త మలుపు తీసుకునేలా కనిపిస్తోంది. పైనాపిల్​ బాంబును ఎవరూ ఏనుగుకు పెట్టి ఉండకపోవచ్చని.. ఏనుగే స్వయంగా దాన్ని తిని ఉండొచ్చని పర్యావరణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. కేసు ప్రాథమిక దర్యాప్తులో ఈ విషయం తెలిసినట్టు స్పష్టం చేసింది.

Elephant may have accidentally consumed cracker-filled fruit: Environment Min
ఆ బాంబు ఉన్న పండును ఏనుగే తినిందా!

కేరళలో మృతిచెందిన ఏనుగు.. పైనాపిల్​ బాంబును ప్రమాదవశాత్తు ఆరగించి ఉండొచ్చని పర్యావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేసు ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా ఈ వ్యాఖ్యలు చేసింది. అడవి పందుల బారి నుంచి తమ పొలాలను రక్షించుకోవడానికి స్థానికులు ఈ తరహా విస్ఫోటాలతో అక్రమ చర్యలకు పాల్పడుతుంటారని గుర్తించినట్టు వివరించింది.

"ఆ పండును ఏనుగు ప్రమాదవశాత్తు ఆరగించి ఉండొచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కేరళ ప్రభుత్వాన్ని పర్యావరణశాఖ నిరంతరం సంప్రదిస్తోంది. ఈ నేరానికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేసి వారిపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్యలకు పాల్పడిన ఇతరులను పట్టుకోవడానికి కృషి చేస్తున్నారు."

--- పర్యావరణమంత్రిత్వ శాఖ ట్వీట్​.

సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఊహాగానాలను నమ్మవద్దని పర్యావరణశాఖ సహాయమంత్రి బాబుల్​ సుప్రియో వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఆ శాఖ ట్విట్టర్​ ద్వారా వెల్లడించింది.

ఘటనను తీవ్రంగా పరిగణించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఎప్పటికప్పుడు అధికారులతో సమావేశమై పరిస్థితులను సమీక్షిస్తున్నాయి.

ఇదీ చూడండి:- 'భరించలేని నొప్పి, ఆకలితోనే ఏనుగు మృతి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.