ETV Bharat / bharat

ముంబయిలో పవర్​ కట్​- ప్రజలకు అవస్థలు

author img

By

Published : Oct 12, 2020, 10:50 AM IST

Updated : Oct 12, 2020, 12:12 PM IST

ముంబయి పరిసర ప్రాంతాల్లో విద్యుత్​ సరఫరా లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. టాటా సంస్థకు చెందిన గ్రిడ్​ దెబ్బతినడం వల్ల సరఫరాలో అంతరాయం ఏర్పడినట్లు బృహన్​ ముంబయి తెలిపింది.

Electric supply in Mumbai interrupted
గ్రిడ్​ దెబ్బతినడం వల్ల ముంబయిలో కరెంట్​ కోత

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో విద్యుత్​ సరఫరా నిలిచిపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మెట్రోపాలిటన్​ రీజియన్​లోని గ్రిడ్​ దెబ్బతినడం వల్ల విద్యుత్​ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

ముంబయి తూర్పు, పడమర, ఠానె, పాల్ఘడ్​, రాయ్​గఢ్​ సహా పలు ప్రాంతాలు కొన్ని గంటలుగా అంధకారంలోనే ఉన్నాయి. సేవల్లో అంతరాయం పట్ల చింతిస్తున్నట్లు బృహన్​ ముంబయి ఎలక్ట్రిసిటీ సప్లై అండ్​ ట్రాన్స్​పోర్ట్​ (బెస్ట్)​ వినియోగదారులకు ట్విట్టర్​ ద్వారా తెలియజేసింది. ఆయా ప్రాంతాల్లోని లోకల్​, మెట్రో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్​ సిగ్నళ్లు ఆగిపోయాయి. ఫలితంగా రోడ్లపై రద్దీ ఏర్పడింది.

  • The electric supply is inttruptted due to TATAs incoming electric supply faiure.
    Inconveniences is regretted.

    — BEST Electricity (@myBESTElectric) October 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

విద్యుత్ ‌వైఫల్యంతో ఆస్పత్రులపై ఎలాంటి ప్రభావం లేకుండా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. సబర్బన్ రైళ్లు నిలిచిపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 400 కేవీ లైన్ ట్రిప్ అయిన‌ట్లు స‌మాచారం. అయితే ఆ ఎల‌క్ట్రిక్ లైన్‌ను అధికారులు పున‌రుద్ధరిస్తున్నారు. ఎంఐడీసీ, పాల్ఘర్‌ లైన్​లో స‌ర‌ఫ‌రా పూర్తిగా నిలిచిపోయింది. ముంబయి న‌గ‌రానికి వెళ్తున్న 360 మెగా వాట్ల ప‌వ‌ర్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌లిగిన‌ట్లు తెలుస్తోంది. దేశీయ స్టాక్‌ఎక్సేంజీలు బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈలు మాత్రం ట్రేడింగ్‌ను కొన‌సాగిస్తున్నాయి.

గంటలో పునరుద్ధరిస్తాం...

మరో గంటలో ముంబయిలో విద్యుత్​ సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటికే పలు విద్యుత్​ లైన్లను వేరే గ్రిడ్​తో అనుసంధానిస్తున్నట్లు పేర్కొన్నారు.

Last Updated : Oct 12, 2020, 12:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.