ETV Bharat / bharat

భారత్​ భేరి: దేశవ్యాప్తంగా పోలింగ్​ ప్రారంభం - యూపీ

దేశంలోని మొత్తం 91 లోక్​సభ స్థానాలకు ఎన్నికలు ప్రారంభమయ్యాయి. అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే ఓటు వినియోగించుకోవడానికి బారులు తీరారు ప్రజలు. 14 కోట్ల 20 లక్షల 54 వేల మంది ఓటర్లు 1279 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు. మిగిలిన 6 విడతల పోలింగ్ ముగిశాక మే 23న ఫలితాలు వెలవడనున్నాయి.

భారత్​ భేరి
author img

By

Published : Apr 11, 2019, 7:03 AM IST

సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే ఓటు వినియోగానికి లైన్లలో వేచి ఉన్నారు ఓటర్లు. మొత్తం 91 లోక్​సభ స్థానాలకు తొలిదశలో పోలింగ్​ జరుగుతుంది. 1,279 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 14 కోట్ల 20 లక్షల 54 వేల మంది ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.

మొత్తం 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తొలిదశ పోలింగ్​ మొదలైంది. ఎన్నికల కోసం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు.

LOKSABHA
2019 ఎన్నికలు

తెలుగు రాష్ట్రాల్లో...

ఆంధ్రప్రదేశ్​ -25, తెలంగాణ- 17 కలిపి మొత్తం 42 లోక్​సభ స్థానాలకు పోలింగ్​ జరుగుతుంది. మొదటి విడతలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియనున్నాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.

యూపీలో భద్రత నడుమ...

అత్యధిక లోక్​సభ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్​లో 8 లోక్​సభ నియోజకవర్గాలకు ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా ఎన్నికల సంఘం భద్రతా ఏర్పాట్లు చేసింది. లక్ష మందికిపైగా భద్రతా సిబ్బందిని మోహరించారు.

బస్తర్​ కట్టుదిట్టం..

ఛత్తీస్​గఢ్​ బస్తర్​ లోక్​సభ నియోజకవర్గం ప్రత్యేకం. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కారణంగా ఇక్కడ 80 వేల మంది సిబ్బంది పహారా కాస్తున్నారు. దంతెవాడ బస్తర్​ పరిధిలోకే వస్తుంది. 741 పోలింగ్​ కేంద్రాలను అత్యంత సమస్యాత్మకంగా గుర్తించారు

తొలిసారి పూర్తిస్థాయిలో...

సార్వత్రిక ఎన్నికల కోసం తొలిసారి పూర్తిస్థాయిలో వీవీప్యాట్​ ఈవీఎంలు ఉపయోగిస్తోంది ఈసీ. వీవీప్యాట్​లో వచ్చే రసీదు చూసి, మన ఓటు ఎవరికి పడిందో నిర్ధరించుకోవచ్చు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
TWITTER @EUCOPRESIDENT - AP CLIENTS ONLY
Internet - 11 April 2019
1. Screenshot of tweet by European Council President Donald Tusk reading (English) "EU27 has agreed an extension of Art. (Article) 50. I will now meet PM (Prime Minister) @theresa_may (Theresa May) for the UK government's agreement. #Brexit"
STORYLINE:
European Union leaders on Thursday offered the UK an extension to Brexit that would allow the country to delay its EU departure date until Halloween.
Leaders of the 27 remaining EU member states met for more than six hours before agreeing after midnight to postpone Brexit until October 31, two officials said.
The officials spoke to The Associated Press on condition of anonymity to discuss the closed-door negotiations.
European Council President Donald Tusk confirmed in a tweet that an extension had been agreed to, but he did not disclose the date.
Tusk said he would now meet with the UK Prime Minister Theresa May to see of the UK would agree to the extension.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.