ETV Bharat / bharat

'గందరగోళం వద్దు- ఇప్పుడున్నదీ ఒకే ఓటరు జాబితా' - op rawat

ఓటర్ల జాబితా విషయంలో గందరగోళం అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ ఓపీ రావత్ పేర్కొన్నారు. ఎన్నికల నేరాల కోసం ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయడం కష్టమేనని అభిప్రాయపడ్డారు. మన ఎన్నికల చట్టాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. ఈ మేరకు 'ఈనాడు'తో ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.

election commission former cec op rawat special interview with eenadu
ఓపీ రావత్
author img

By

Published : Sep 13, 2020, 8:01 AM IST

ఓటర్ల జాబితా విషయంలో గందరగోళం అవసరం లేదని, ప్రస్తుతం ఉన్నది కూడా ఒక్కటే జాబితా అని కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్‌ ఓపీ రావత్‌ అన్నారు. ప్రస్తుత జాబితాలో సాంకేతిక తేడాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. వార్డులను పెంచుకోవాలంటే రాష్ట్రాల ఎన్నికల కమిషన్‌ చట్టాలను సవరిస్తే సరిపోతుందని స్పష్టం చేశారు.

రాజ్యాంగ సవరణ చేయాల్సింది నియోజకవర్గాల పునర్విభజన కోసం మాత్రమేనని అన్నారు రావత్. 2031లోగా పునర్విభజన సాధ్యమవుతుందా? లేదా? అన్నది వేచిచూడాల్సిందేనని పేర్కొన్నారు. ఎన్నికల వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తే అవినీతి ఉండదనేది అర్థం లేని వాదన అని అన్నారు. ప్రస్తుత కరోనా నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ పెద్ద సవాల్​తో కూడుకున్నట్లు చెప్పారు. ఒకే దేశం...ఒకే ఓటరు జాబితాపై ఆయన 'ఈనాడు'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

election commission former cec op rawat special interview with eenadu
ఓపీ రావత్

ఒకే దేశం... ఒకే ఓటరు జాబితా... ఆచరణాత్మకమేనా?

ప్రస్తుతం ఉన్నది ఒకటే ఓటరు జాబితా. దాన్ని రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో కేంద్ర ఎన్నికల సంఘం తయారు చేయిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్లు ఆ జాబితాను వినియోగించుకుంటాయి. వారు కొత్తగా ఇంటింటికి వెళ్లి జాబితాలను తయారు చేయరు. ఎక్కడో సమాచార లోపం ఉన్నట్లుంది. రాజ్యాంగ సవరణ దాకా వెళ్లాల్సిన అవసరం లేదనుకుంటున్నాను.

స్థానిక సంస్థల ఎన్నికలు వార్డుల కేంద్రంగా జరుగుతాయి కదా? అప్పుడైనా జాబితా తయారు చేయాల్సిందే కదా?

అవును చేయాలి. పార్లమెంటు లేదా అసెంబ్లీ ఎన్నికలను వార్డుల వారీగా నిర్వహించలేం కదా? గతంలో వార్డుల వారీగా విభజించటం సమస్యగా ఉండేది.ప్రస్తుతం సాంకేతిక సహకారంతో ఈ సమస్యను సులువుగా అధిగమించవచ్చు. కొందరు దేశాన్ని గందరగోళంలోకి నెడుతున్నారు.

రాజ్యాంగ సవరణ కూడా చేయాలంటున్నారు కదా?

ఆ వాదనలో అర్థం లేదు. రాజ్యాంగ సవరణ చేయాల్సింది నియోజకవర్గాల పునర్విభజన కోసమే. స్థానిక సంస్థల్లో జనాభా పెరిగితే వార్డులు పెంచుకోవాలంటే రాష్ట్ర ఎన్నికల సంఘంలోని నిబంధనలు మార్చుకోవాలి. ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన 2031 వరకు సాధ్యం కాదు. అందుకు సంబంధించిన రాజ్యాంగ సవరణపై గడిచిన కొన్నేళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. అది కూడా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా విడిపోవడంతోనే ఈ అంశం ప్రధానంగా తెరపైకి వచ్చింది. మిగిలిన రాష్ట్రాల్లో ఈ డిమాండు అంతగా లేదు.

ఎన్నికల సంఘం ముందున్న సవాళ్లు ఏమిటి?

చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి కరోనా పెద్ద సమస్య. ఈ సమయంలో ఎన్నికల నిర్వహణ అంతసులువు కాదు. భౌతిక దూరాన్ని పాటిస్తూ ప్రచారం చేసేలా చూడాలి.. ఈవీఎంలోని గుర్తును ఒకరు నొక్కిన తరువాత మళ్లీ శానిటైజర్‌తో శుద్ధి చేయాలి. పోలింగ్‌ సమయంలో ఓటర్లు వరసల్లో భౌతిక దూరం పాటించేలా చూడటం కూడా సమస్యే.

ఎన్నికల్లో నల్లధనాన్ని నియంత్రించేందుకు ఎన్నికల వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలన్న వాదనలో సాధ్యాసాధ్యాలు..

అర్థరహిత వాదన. ఎన్నికల్లో పోటీ చేసే వారిలో కొందరు పెద్ద మొత్తాల్లో నల్లధనాన్ని వెచ్చిస్తున్నారు. ఎన్నికల వ్యయాన్ని ప్రభుత్వమే భరించినంత మాత్రాన ఆ అభ్యర్థులు ఆగరు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాధనాన్ని ఖర్చుచేయడం చారిత్రక తప్పిదమవుతోంది. నేను ప్రధాన కమిషనర్‌గా ఉన్న సమయంలో పలువురు రాజకీయ నాయకులు నా వద్ద ఈ అంశాన్ని పలు దఫాలు ప్రస్తావిస్తే నిర్ద్వంద్వంగా తిరస్కరించాను.

2031 సంవత్సర జనాభా లెక్కల లోపు నియోజకవర్గ పునర్విభజన సాధ్యమేనా?

వేచి చూద్దాం. ఇందుకు సంబంధించి రకరకాల సమావేశాలు జరిగాయి. రానున్న రోజుల్లో మరిన్ని జరుగుతాయి. ఇటీవల వరకు ఆ క్రతువులో భాగస్వామినైన నేను ఆ విషయాలపై మాట్లాడటం సముచితం కాదు.

ఎన్నికల నియమావళిని అతిక్రమించిన రాజకీయ నాయకులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవటంలో విఫలమవటానికి కారణాలేమిటి?

విఫలమైందన్నది సరికాదు. చాలా సందర్భాల్లో కఠినంగానే వ్యవహరిస్తోంది. కొంత జాప్యం జరుగుతున్న మాట వాస్తవమే. న్యాయశాఖలో సంస్కరణలు చేస్తే కానీ ఎన్నికల నేరాల కోసం ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయలేం. ఈ అంశంపై గతంలో చర్చలు జరిగాయి. పెద్ద పెద్ద నేరాల విషయంలో ఒకటీ అర తప్పించి ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయటం సాధ్యం కావటం లేదు. ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టారనో, ఓటర్లను ప్రలోభపెట్టారనో ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేసి విచారించే సాధన సంపత్తి ఉందనుకోవటం లేదు. ఒకపని చేయవచ్చు. ఎన్నికల నేరాలను కనీసం రెండు నుంచి మూడేళ్లలో తేల్చేందుకు వీలుగా చర్యలు తీసుకోవచ్చు. ఇప్పటికీ మనదేశ ఎన్నికల చట్టాలు ప్రపంచం మొత్తానికీ ఆదర్శం.

ఓటర్ల జాబితా తయారీ దశలోనే వార్డుల వారీగా కూడా చేయవచ్చు కదా?

చేసుకోవచ్చు.. అయితే కొంత గందరగోళంగా ఉంటుంది. దాన్ని వేరుగా చేసుకోవటం మంచిదేమో.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.