దేశంలో సంచలనం సృష్టించిన కేరళ బంగారం అక్రమ రవాణా కేసు విచారణ మరింత వేగంగా కొనసాగుతోంది. తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ వ్యవహారంపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై 'ఎన్ఐఏ' నమోదు చేసిన అభియోగాలను పరిశీలించిన ఈడీ... ఎఫ్ఐఆర్కు సమానమైన... ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు (ఈసీఐఆర్) నమోదు చేసింది. నిందితుల నుంచి వాంగ్మూలం తీసుకునేందుకు సమాయత్తమవుతోంది. అవసరమైతే నిందితులకు చెందిన స్థిర, చరాస్తులను కూడా స్తంభింపజేసేందుకు ఈడీకి అధికారం ఉంది.
బడా స్మగ్లింగ్
జులై 5న గల్ఫ్ నుంచి తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన కార్గో నుంచి సుమారు రూ.15 కోట్లు విలువ చేసే 30 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ స్మగ్లింగ్ కేసులో నలుగురి పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రధాన నిందితులు సరిత్, స్వప్నా సురేష్, సందీప్ నయ్యర్, ఫాజిల్ ఫరీద్ను అరెస్టు చేసి విచారించారు. ఇప్పటికే ఈ కేసుపై కస్టమ్స్, ఎన్ఐఏ, ఆదాయ పన్నుశాఖలు దర్యాప్తు చేస్తున్నాయి. తాజాగా ఈడీ కూడా విచారణ ప్రారంభించింది.
ఇదీ చూడండి: గ్యాంగ్స్టర్ దుబే ఎన్కౌంటర్పై దర్యాప్తు షురూ!