మత ప్రబోధకుడు జకీర్‌పై ఈడీ ఛార్జిషీటు వివాదాస్పద ఇస్లామిక్ ప్రబోధకుడు జకీర్ నాయక్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరో అభియోగపత్రం దాఖలు చేసింది. రూ.193 కోట్ల మేర నేరానికి పాల్పడినట్లు ముంబయిలోని మనీ లాండరింగ్ ప్రత్యేక కోర్టుకు సమర్పించిన అభియోగపత్రంలో అధికారులు పేర్కొన్నారు. ఇది ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన రెండో ఛార్జిషీటు. మొదటి దానిలో జకీర్ పాత్రపై మాత్రమే ఈడీ అభియోగపత్రం దాఖలు చేసింది.
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఎఫ్ఐఆర్ ఆధారంగా జకీర్ నాయక్‌పై 2016లో ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది.
ఇదీ చూడండి: మసూద్ అంశంపై ఆగని మాటల మంటలు