మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ మేనల్లుడు రతుల్ పురీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. అగస్టా వెస్ట్‌లాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో రతుల్‌ను అదుపులోకి తీసుకుని దిల్లీ కోర్టు ముందు హాజరుపరిచారు. న్యాయస్థానం రతుల్‌కు ఒక్కరోజు రిమాండ్ విధించింది. కస్టడీకీ అప్పగింతపై ఈడీ వాదనలను రేపు విననుంది.
బ్యాంకు మోసానికి సంబంధించిన మరో మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్నారు రతుల్.
ఇటలీకి చెందిన ఫిన్మెక్కానికా బ్రిటిష్ అనుబంధ సంస్థ అగస్టా వెస్ట్‌లాండ్ నుంచి 12 వీవీఐపీ ఛాపర్ల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ మనీలాండరింగ్ కేసు నమోదైంది.
ఇదీ చూడండి: భారత్-రష్యా మధ్య 15 కీలక రంగాల్లో ఒప్పందాలు