మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ మేనల్లుడు, వ్యాపారవేత్త రతుల్పూరిని.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకులను మోసం చేసి రూ.354 కోట్ల అక్రమ నగదు చలామణికి పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
ఈడీ ఇవాళ రతుల్పూరిని న్యాయస్థానం ముందు హాజరుపరచనుంది. ఈ కేసు విచారణలో రతుల్ తన సహకారం అందించని నేపథ్యంలో కస్టోడియల్ విచారణకు అనుమతించమని న్యాయస్థానాన్ని కోరనుంది.
ఈ కేసులోనే ఈ నెల 18న కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)... పూరికి సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. అతని తల్లిదండ్రులు, నీతాపూరి, దీపక్పూరిలపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఆ తరువాత ఇదే కేసులో రతుల్‌కు సమన్లు జారీ చేసిన ఈడీ నిన్న ఆయన్ను అదుపులోకి తీసుకుంది. అగస్టా వెస్ట్‌లాండ్... వీవీఐపీ ఛాపర్ కుంభకోణం కేసులోనూ రతుల్‌పై ఈడీ నిఘా ఉంచింది.
ఇదీ చూడండి: నేడు రాజీవ్‌గాంధీ జయంతి.. ప్రముఖుల ఘన నివాళి