ETV Bharat / bharat

ఝార్ఖండ్​ శాసనసభ ఎన్నికల నగారాకు రంగం సిద్ధం - ఝార్ఖండ్​ శాసనసభ ఎన్నికల నగారాకు రంగం సిద్ధం

ఝార్ఖండ్​ శాసనసభ ఎన్నికల నగారా నేడు మోగనుంది. ఈరోజు సాయంత్రం షెడ్యూల్​ విడుదల చేయనుంది ఎన్నికల సంఘం. 81 స్థానాలు ఉన్న ఝార్ఖండ్​ ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి జనవరి 5తో ముగుస్తుంది.

ఝార్ఖండ్​ శాసనసభ ఎన్నికల నగారాకు రంగం సిద్ధం
author img

By

Published : Nov 1, 2019, 1:25 PM IST

ఝార్ఖండ్​ శాసనసభ కాలపరిమితి జనవరి 5తో ముగుస్తున్న నేపథ్యంలో ఎన్నికలకు సిద్ధమైంది భారత ఎన్నికల సంఘం. సాయంత్రం దిల్లీలో షెడ్యూల్​ విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఝార్ఖండ్​తో పాటు దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కూడా షెడ్యూల్​ విడుదల చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినబడుతున్నాయి. కానీ.. దీనిపై ఈసీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

2014 ఎన్నికల్లో భాజపా విజయం..

ఝార్ఖండ్​లో 81 స్థానాలకుగాను 2014 నవంబర్​ 25-డిసెంబర్​ 20 మధ్య ఐదు దశల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో భాజపా 37 స్థానాల్లో విజయం సాధించింది. ఆల్​ ఝార్ఖండ్​ స్టూడెంట్స్​ యూనియన్​ (5)తో జట్టు కట్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా రఘుబర్​దాస్​ బాధ్యతలు చేపట్టారు.
కాంగ్రెస్​ పార్టీ 7 స్థానాలకే పరిమితమైంది. ఝార్ఘండ్​ ముక్తి మోర్చా 19, ఝార్ఘండ్​ వికాస్​ మోర్చా 8 సీట్లు సాధించాయి.

ఆపరేషన్​ ఆకర్ష్​...

శాసనసభ ఎన్నికలకు ముందు నలుగురు విపక్ష ఎమ్మెల్యేలు అధికార భాజపాలో చేరారు. ఇద్దరు కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు సుఖ్​దేవ్​ భగత్​, మనోజ్​ యాదవ్​, ఝార్ఖండ్​ ముక్తి మోర్చా (జేఎంఎం) నుంచి కునాల్​ సారంగి, స్వతంత్ర ఎమ్మెల్యే భాను ప్రతాప్​ సాహి భాజపా తీర్థం పుచ్చుకున్నారు.

ఇదీ చూడండి: ఆ రాష్ట్రాలకు మోదీ, రాహుల్​ శుభాకాంక్షలు

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.