ఎన్నికల అక్రమార్కులపై ఈసీ(ఎన్నికలసంఘం) కొరడా ఝుళిపిస్తోంది. షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి నేటికి (ఏప్రిల్ 4) దేశవ్యాప్తంగా రూ.377.511 కోట్ల అక్రమ నగదు, రూ.157 కోట్లు విలువ చేసే మద్యం, రూ.705 కోట్ల విలువైన మత్తుపదార్థాలు, రూ.312 కోట్లు విలువైన లోహాలను జప్తు చేసింది. మొత్తంగా రూ.1551 కోట్ల విలువైన నగదు,వస్తువులను స్వాధీనం చేసుకుంది.
ఇందులో అత్యధికంగా గుజరాత్లో రూ.9 కోట్ల నగదు, రూ.500 కోట్లు విలువచేసే మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
తమిళనాడు(రూ.208.55 కోట్లు), ఆంధ్రప్రదేశ్(రూ.158.61 కోట్లు), పంజాబ్(రూ.144.39 కోట్లు), ఉత్తరప్రదేశ్(రూ.135.13 కోట్లు) రాష్ట్రాలు వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
పట్టుబడ్డ నగదుకు సరైన పత్రాలు చూపితే డబ్బును తిరిగి ఇస్తామని అధికారులు తెలిపారు.
ఈనెల 11న సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ జరగనుంది.