ETV Bharat / bharat

ప్రధాని మోదీకి మరోసారి ఈసీ క్లీన్​చిట్​ - ఎన్నికల ప్రవర్తనా నియమావళి

ఎన్నికల సంఘం తాజాగా... మరో రెండు ప్రసంగాలపై ప్రధాని నరేంద్ర మోదీకి క్లీన్​చిట్​ ఇచ్చింది. ఏప్రిల్​ 9, 23 తేదీల్లో మోదీ చేసిన ప్రసంగాలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేలా లేవని స్పష్టం చేసింది.

ప్రధాని మోదీకి ఈసీ మరోసారి క్లీన్​చిట్​
author img

By

Published : May 7, 2019, 4:03 AM IST

ప్రధాని మోదీకి ఈసీ మరోసారి క్లీన్​చిట్​

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎన్నికల సంఘం (ఈసీ) మరోసారి క్లీన్​చిట్ ఇచ్చింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేలా మోదీ ప్రసంగించారని అందిన రెండు ఫిర్యాదులను తోసిపుచ్చింది.

ప్రధాని మోదీ ఏప్రిల్​ 23న అహ్మదాబాద్​లో ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత రోడ్​షో నిర్వహించారని.. తద్వారా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని కాంగ్రెస్ ఆరోపించింది. మోదీ చర్య ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే అని ఈసీకి ఫిర్యాదు చేసింది.

అహ్మదాబాద్​లో ఓటు వేసిన తర్వాత పోలింగ్ కేంద్రం నుంచి కొంత దూరం నడిచివెళ్లారు మోదీ. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ విషయంపై కాంగ్రెస్ చేసిన ఫిర్యాదును విచారించిన ఈసీ... మోదీకి క్లీన్​చిట్​ ఇచ్చింది.

ఈసీలో భిన్నాభిప్రాయాలు

ఏప్రిల్​ 9న కర్ణాటక చిత్రదుర్గలో లోక్​సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ... తొలిసారి ఓటు హక్కు పొందిన ఓటర్లు బాలాకోట్​ వైమానిక దాడి చేసిన హీరోలకు ఓటు వేయాలని సూచించారు. అదే రోజు మహారాష్ట్ర లాతూర్​లోని ఔషాలోనూ ఇదే విజ్ఞాపన చేశారు. ఈ విషయంలోనూ ప్రధాని మోదీకి ఈసీ క్లీన్​చిట్​ ఇచ్చింది ఈసీ.

ఏప్రిల్​ 9న మోదీ చేసిన ప్రసంగానికి క్లీన్​చిట్​ ఇచ్చే విషయంలో ఈసీలోనే భిన్నవాదనలు వినిపించాయని సమాచారం. ఓ ఎన్నికల అధికారి దీనిపై​ అభ్యంతరం వ్యక్తం చేయడం గమనార్హం.

మోదీకి 8, షాకు 2, రాహుల్​కు ఒకటి

ఈసీ ఇప్పటి వరకు మోదీకి (ఈ రెండు కలిపి) 8 సార్లు, భాజపా అధ్యక్షుడు అమిత్​షాకు 2 సార్లు, కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్​గాంధీకి ఓసారి క్లీన్​చిట్​ ఇచ్చింది.

సుప్రీంకు ఈసీ నివేదిక

మోదీ, అమిత్​షాలపై నమోదైన 'ఎన్నికల నియమావళి ఉల్లంఘన' ఫిర్యాదుల విచారణను ఈసీ ఆలస్యం చేస్తోందని... కాంగ్రెస్​ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ విషయంలో ఓ నివేదిక ఇవ్వాలని ఈసీని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ విషయంపై సుప్రీం బుధవారం తీర్పు వెలువరించనుంది.

ఇదీ చూడండి: 'గడువు తీరిన ప్రధానితో వేదిక పంచుకోవాలా?'

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST:
1. ++TO FOLLOW++
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE:
DURATION:
STORYLINE:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.