జమ్ముకశ్మీర్‌లో మరోసారి భూకంపం సంభవించింది. మధ్యస్థ స్థాయిలో భూమి కంపించగా రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రత నమోదైనట్టు భూకంప అధ్యయన కేంద్రం (ఎన్సీఎస్) తెలిపింది. అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లలేదని అధికారులు వెల్లడించారు.
శనివారం మధ్యాహ్నం 12:02 గంటల ప్రాంతంలో ఈ ప్రకంపనలు వచ్చాయి. 120 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైనట్టు తెలిపారు అధికారులు.
ఇదీ చదవండి: లద్దాఖ్‌లో రెండు మూపురాల ఒంటెలతో సైనికుల గస్తీ