మహమ్మారి కరోనా దేశంలో అంతకంతకూ విస్తరిసోంది. రోగుల సంఖ్య పెరిగినకొద్దీ వైద్యులకు సవాలుగా మారుతుంది. పలు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వైద్యులకు వైరస్ సోకే ప్రమాదం అధిక స్థాయిలోనే ఉంది. వైద్యులను వైరస్ ప్రమాదం నుంచి రక్షించేందుకు వివిధ సంస్థలు వినూత్న పరికరాలను ఆవిష్కరిస్తున్నాయి.
తక్కువ ధరతో తయారు చేసిన వెంటిలేటర్ నుంచి శానిటైజ్ చేసే డ్రోన్ల వరకు, ఆహారం ఔషధాలు అందించే రోబోలు, కిరాణా సరకులు, డబ్బును శుభ్రపరిచే యూవీ సాంకేతిక ట్రంక్లను పలు సంస్థలు, అంకురాలు ఆవిష్కరిస్తున్నాయి. కరోనాపై పోరాటాన్ని బలోపేతం చేయడానికి ఈ ఉపకరణలు తోడ్పడుతున్నాయి.
వైద్యులకు రక్షణ కవచాలు
ఆసుపత్రుల్లో వైద్యులను వైరస్ నుంచి కాపాడేవాటిలో ప్రత్యేక వ్యక్తిగత రక్షణ దుస్తులు, అతి తక్కువ ఖర్చుతో తయారు చేసిన వైరస్ పరీక్ష కిట్లు, డిజిటల్ స్టెతస్కోపు, రోబోలు ముఖ్యమైనవి.
కరోనా రోగులకు ఐసోలేషన్ ప్యాడ్స్, సంప్రదాయ ఆక్సిజన్ మాస్కులకు ప్రత్యామ్నాయంగా బబుల్ హెల్మెట్లు వంటివి వచ్చాయి.
మొబైల్ యాప్స్
కరోనా సోకిన వ్యక్తితో పరిచయం ఉన్నవారి ఆచూకీ తెలుసుకోవడానికి, ఆ వ్యక్తి నుంచి ఇతరులు ఏ మేరకు కరోనా బారిన పడే అవకాశం ఉందనే పలు అంశాల గురించి తెలుసుకోవడానికి 'గో కరోనా గో' నుంచి 'శాంపార్కో మీటర్' వరకు ఎన్నో మొబైల్ అప్లికేషన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ క్యారంటైన్ కేంద్రం నుంచి ఎవరైనా తప్పించుకుంటే వారి జాడ తెలుసుకునేలా బెంగుళూరు ఐఐటీ, ఇండియన్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ సంయుక్తంగా ఓ యాప్ను రూపొందించాయి.
వ్యాక్సిన్ అభివృద్ధికి కృషి
కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి 20కి పైగా అత్యాధునిక సాంకేతిక సంస్థలు పనిచేస్తున్నాయి. ప్రముఖ ఐఐటీలు తమ సంస్థలలో ఇప్పటికే 'కొవిడ్ -19 నిర్దిష్ఠ పరిశోధనా కేంద్రాలను' ఏర్పాటు చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) గువాహటి కరోనాపై పోరాటానికి సహాయంగా వివిధ డ్రోన్ల అభివృద్ధికి ముందడుగు వేసింది.
డ్రోన్లు సాయం ఏ మాత్రం?
క్రిమిసంహారక డ్రోన్లు, ఇన్ఫ్రారెడ్ కెమెరా డ్రోన్లు, మానవ రహిత థర్మల్ స్క్రీనింగ్ డ్రోన్లు వంటివి వినియోగంలోకి వచ్చాయి.
![Drones for sanitising, robots in isolation wards, special stethoscope--innovations to fight corona](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6763217_3.jpg)
ఆహారం అందించడానికి రోబోలు
రోగులకు ఔషధాలు, ఆహారం అందించడానికి చాలా దేశాలు ఇప్పటికే రోబోలను వినియోగిస్తున్నాయి.
![Drones for sanitising, robots in isolation wards, special stethoscope--innovations to fight corona](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6763217_1.jpg)
డిజిటల్ స్టెతస్కోపు
ముంబయి ఐఐటీకి చెందిన వారు డిజిటల్ స్టెతస్కోపు అభివృద్ధి చేశారు. ఇది దూరం నుంచి రోగుల గుండె చప్పడు విని రికార్డు వైద్యలకు తెలియజేస్తుంది. తద్వారా వైద్యలను వైరస్ బారి నుంచి కాపాడవచ్చు.
![Drones for sanitising, robots in isolation wards, special stethoscope--innovations to fight corona](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6763217_2.jpg)
ఇదీ చూడండి: కరోనా ఎఫెక్ట్: 'ఈస్టర్ సండే' రోజు కళతప్పిన చర్చిలు