డీఆర్డీఓ ఛైర్మన్‌గా డాక్టర్ సతీష్ రెడ్డి పదవీ కాలాన్ని మరో రెండు సంవత్సరాలు పొడగించింది కేంద్రం. ఈ మేరకు సిబ్బంది శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
2018లో రెండు సంవత్సరాల కాలవ్యవధితో సతీష్ రెడ్డిని డీఆర్డీఓ ఛైర్మన్‌గా కేంద్రం నియమించింది. ఆగస్టు 26తో ఈ పదవీకాలం ముగియనుండటం వల్ల తాజా ప్రకటన జారీ చేసింది.
ఈ మేరకు సతీష్ రెడ్డిని కొనసాగించేందుకు కేబినెట్ అపాయింట్మెంట్ కమిటీ ఆమోదం తెలిపింది. డీఆర్డీఓ ఛైర్మన్‌తో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్యదర్శిగానూ సతీష్ రెడ్డి మరో రెండేళ్లు కొనసాగనున్నారు.