టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఓటు గల్లంతు అంశంపై కర్ణాటక ప్రధాన ఎన్నికల కమిషనర్ సంజీవ్ కుమార్ స్పందించారు. ఇల్లు మారిన ద్రవిడ్... కొత్త చిరునామాతో కూడిన వివరాలను ఎన్నికల అధికారులకు సమర్పించలేదని, అందుకే ఆయన పేరు ఓటరు జాబితాలో లేకపోవచ్చని సీఈఓ వివరణ ఇచ్చారు.
"కొత్త చిరునామాతో కూడిన వివరాలను ద్రవిడ్ ఎలక్టోరల్ కార్యాలయంలో సమర్పించలేదు. ఇందుకు సంబంధించి ఆయన ఇంత వరకు ఎలాంటి ముందడగు వేయలేదు" --సంజీవ్ కుమార్, కర్ణాటక సీఈఓ
కర్ణాటక ఎన్నికల సంఘం బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న రాహుల్ ద్రవిడ్ ఓటు గల్లంతవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
రాహుల్ ద్రవిడ్ ఇప్పటివరకు తన పూర్వీకుల ఇంట్లో ఉండేవారు. ప్రస్తుతం వేరే గృహానికి మకాం మార్చారు. ఓటును తొలగించేందుకు ద్రవిడ్ పాత ఇంట్లో ఉంటున్న ఆయన సొదరుడు ఫామ్-7 పత్రం సమర్పించారు.
ఏప్రిల్ 18న కర్ణాటకలో లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ జరగనుంది.