బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ వేడి మరింత రాజుకుంది. నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూకు ఓటెయొద్దని రాష్ట్ర ప్రజలను కోరారు లోక్ జన్‌శక్తి పార్టీ(ఎల్జేపీ) అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్. ఇటీవలే జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీఏ)ని వీడిన చిరాగ్.. నితీశ్‌ను లక్ష్యంగా చేసుకొని ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల అనంతరం భాజపా-ఎల్జేపీలే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాయని ధీమా వ్యక్తం చేశారు పాసవాన్.
"బిహార్ చరిత్రలో ఇది అత్యంత కీలక పరిణామం. ఈ ఎన్నికలతో రాష్ట్రంలోని 12కోట్ల మంది జీవితాలు ముడిపడి ఉన్నాయి. ఈ తరుణంలో ఎల్జేపీ ముందుకెళ్లడం అంత తేలికైన పనికాదు. అయినప్పటికీ మేం పోరాడతాం. గెలిచి తీరతాం."
- చిరాగ్ పాసవాన్, లోక్ జన్‌శక్తి పార్టీ అధ్యక్షుడు
ఎన్డీఏలో కుమార్ నాయకత్వాన్ని అంగీకరించమన్న ఎల్జేపీ.. ఆయన కారణంగానే ఇటీవలే కూటమి నుంచి వైదొలిగింది. అయితే.. ఎన్నికల అనంతరం ఎల్జేపీ ఎమ్మెల్యేలందరూ ప్రధాని మోదీ నాయకత్వంలోనే పనిచేస్తారని స్పష్టం చేశారు పాసవాన్.
ఇదీ చదవండి: 'బిహార్‌లో ఎన్డీఏ గెలుపునకు అసలు కారణం ఆర్జేడీ'.