ETV Bharat / bharat

మూగజీవికి నరకయాతన.. ఈ సారి శునకం!

కేరళలో ఇటీవల సంచలనం సృష్టించిన గజరాజు హత్యోదంతం మరువక ముందే.. ఇంకో మూగజీవి దీనగాథ వెలుగులోకి వచ్చింది. కొందరి కర్కశత్వానికి.. ఈసారి ఓ శునకం తీవ్రంగా గాయపడింది.

Dog with its mouth sealed by tape for 2 weeks rescued in Kerala
మూగజీవికి నరక యాతన.. ఈసారి శునకం!
author img

By

Published : Jun 11, 2020, 1:25 PM IST

మూగజీవులపై పెరుగుతోన్న దాడులు అందరి హృదయాలను ద్రవింపజేస్తున్నాయి. కేరళలో సంచలనం సృష్టించిన ఏనుగు హత్యా ఘటన మరవక ముందే.. త్రిస్సూర్​ జిల్లా ఒల్లూర్​లో మరో దారుణగాథ వెలుగులోకి వచ్చింది. మూగజీవులపై కొందరు క్రూరంగా ప్రవర్తిస్తోన్న తీరు కంటతడి పెట్టిస్తోంది. ఈ సారి ఓ శునకం పట్ల నిర్దయగా ప్రవర్తించారు కొందరు వ్యక్తులు.

Dog with its mouth sealed by tape for 2 weeks rescued in Kerala
ముఖానికి తగిలిన గాయంతో శునకం

ముఖానికి ఇన్సులేషన్​ టేప్​ చుట్టి.. మూసి ఉన్న ఓ దుకాణానికి కట్టేసిన ఓ శునకాన్ని గుర్తించారు 'పీపుల్‌ ఫర్ యానిమల్ వెల్ఫేర్' సభ్యులు. కొద్దిరోజులుగా నీరు, ఆహారంలేని ఆ కుక్కు.. బాగా నీరసించిపోయింది. దాని మూతికి ఉన్న టేప్​ను బట్టి.. సుమారు రెండు వారాల క్రితమే ఈ ఘటన జరిగి ఉంటుందని భావించారు. జంతు సంరక్షణ సంస్థ సభ్యులు గుర్తించే సమయానికి శునకం ఉన్న తీరును చూస్తే ఎవరికైనా జాలేస్తుంది.

దుకాణానికి కట్టేసిన కుక్క

ఈ విషయాన్ని గమనించిన వాలంటీర్లు.. వెంటనే ఆ టేప్​ను కత్తిరించారు. అనంతరం దాన్ని యానిమల్​ షెల్టర్​ హోమ్​కు తరలించి, చికిత్స అందించారు.

ఇదీ చదవండి: కేరళలో మరో ఏనుగు మృతి.. కారణం అదేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.