దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్నప్పటికీ అక్కడక్కడా నేరాలు జరగుతూనే ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూలోని సుశాంత్ గల్ఫ్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. కొంతమంది దుండగులు ఓ వైద్యుడ్ని కాల్చి.. అతని కారులోనే పరారయ్యారని పోలీసులు తెలిపారు.
ఇదీ జరిగింది!
కింగ్‌జార్జ్ వైద్య విశ్వవిద్యాలయం (కేజీఎంయూ)లో కమ్యూనిటీ మెడిసిన్ విభాగానికి చెందిన వికే సింగ్ అనే వైద్యుడు.. ఖేరా గ్రామంలోని తన సోదరుడి ఇంటి నుంచి వస్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
"ఇద్దరు వ్యక్తులు కారును అడ్డుకొని అతడ్ని బయటకు దిగమన్నారు. అయితే అందుకు ఆయన నిరాకరించడం వల్ల కాల్చి... అతని కారులోనే పారిపోయారు" - పోలీసులు
క్షేమం..
గాయపడిన వైద్యుడ్ని విశ్వవిద్యాలయంలోని గాయాల వార్డులో చేర్చామని.. అతని పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.
ఇదీ చూడండి: భారత్‌లో కరోనా విజృంభణ- ఒక్కరోజులో 47మంది మృతి