తమిళనాడులోని చెన్నైలో ఓ బాలుడి నోటి నుంచి 526 దంతాలను వైద్యులు విజయవంతంగా తొలగించారు. ఇది చాలా అరుదైన కేసు అని, నోటిలోని ఒకే ప్రాంతం నుంచి ఇన్ని పళ్లను వెలికితీయడం మొదటిసారని వైద్యులు స్పష్టం చేశారు. మొట్టమొదటిసారిగా కింది దవడ వాపు అన్న కారణంతో బాలుడిని ఆసుపత్రికి తీసుకువచ్చారని సమాచారం.
ఐదుగురు శస్త్ర చికిత్స నిపుణులు, మరో ఏడుగురు సభ్యుల వైద్యబృందం 5 గంటలపాటు శ్రమించి ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేశారు. వెలికితీసిన దంతాలన్నీ చిన్న పరిమాణంలో ఉన్నట్లు గుర్తించారు.
"బాలుడికి మూడేళ్ల వయసున్నప్పుడు ఈ సమస్య గుర్తించాం. చిన్న వయస్సు కారణంగా అతడు ఆపరేషన్‌కు సహకరించలేకపోయాడు. ఇంతలో దవడ మరింత వాచింది. పిల్లాడిని ఎంతో ఓపికగా ఆపరేషన్‌కు ఒప్పించాం."
-డా. ప్రతిభా రమణి, సవీతా దంత ఆసుపత్రి, చెన్నై
2014లో టీనేజీలో ఉన్న వ్యక్తి నోటి నుంచి 232 పళ్లను తొలగించిన కేసు ముంబయిలో నమోదైందని వైద్యులు గుర్తు చేశారు.
రూ. 75 వేల నుంచి లక్ష వరకు ఖర్చయ్యే ఈ ఆపరేషన్‌ను తమిళనాడు ప్రభుత్వ పథకంతో ఉచితంగా చేశామని వైద్యులు వెల్లడించారు.
ఇదీ చూడండి: 'ఎన్ఎంసీ బిల్లును ఆమోదిస్తే నిరవధిక సమ్మె'