తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్ష డీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయానికి బాంబు హెచ్చరిక వచ్చింది. వెంటనే అప్రమత్తమయిన అధికారులు తనిఖీలు చేపట్టారు. జాగిలాలు, బాంబ్ స్క్వాడ్‌తో పూర్తిగా పరిశీలించారు.
ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువు లభించలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఇదొక బూటకపు హెచ్చరిక అని తేల్చి చెప్పారు. ఫోన్ చేసిన వ్యక్తి వివరాలు లభించాయని ప్రకటించారు.
ఇదీ చూడండి: నిజాయతీకి బదిలీ బహుమానం-ఖేమ్కా.. 53వ సారి