తమిళనాడులో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి రౌండ్లో స్టాలిన్ ఆధ్వర్యంలోని డీఎంకే, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ కూటమి బలపరిచిన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మొత్తం 5090 వార్డులకు గాను డీఎంకే కూటమి ఇప్పటికే 1895 వార్డులను కైవసం చేసుకుంది. ఇందులో డీఎంకే 1715 దక్కించుకోగా.. కాంగ్రెస్ 96, సీపీఐ 60, సీపీఎం 24 చోట్ల నెగ్గింది. ఏఐఏడీఎంకే, భాజపా, డీఎండీకే కూటమి 1528 వార్డులను గెల్చుకుంది.
రాష్ట్రంలో ఇటీవల రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా.. ఏఐఏడీఎంకే విజయం సాధించింది. అయితే ఆ ఫలితాలే పునరావృతం అవుతాయని భావించిన అధికార పార్టీకి పంచాయతీ ఎన్నికల్లో భంగపాటు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఫలితాలు ఎలా ఉన్నా ప్రజా తీర్పును గౌరవిస్తామని అన్నారు ఏఐఏడీఎంకే అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం. మొత్తం 27 జిల్లాల్లో ఎన్నికలు నిర్వహించారు.