ETV Bharat / bharat

మరోసారి ఆస్పత్రిలో చేరిన విజయకాంత్

డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ మరోసారి ఆస్పత్రిలో చేరారు. ఇటీవలే కరోనా బారిన పడి పది రోజులు చికిత్స చేయించుకున్న ఆయన.. సాధారణ పరీక్షల నిమిత్తం ఆస్పత్రిలో చేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని స్పష్టం చేశాయి.

Vijayakanth admitted to Chennai hospital
మరోసారి ఆస్పత్రిలో చేరిన విజయకాంత్
author img

By

Published : Oct 7, 2020, 2:35 PM IST

ప్రముఖ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ ఆస్పత్రిలో చేరారు. సాధారణ పరీక్షల కోసం మంగళవారం రాత్రి మద్రాస్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ అండ్ ట్రామాటాలజీ(ఎంఐఓటీ) ఆస్పత్రిలో చేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

విజయకాంత్ ఆరోగ్యం బాగానే ఉందని, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మొద్దని డీఎండీకే పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది.

విజయకాంత్ ఆస్పత్రిలో చేరికపై ఎంఐఓటీ సైతం ప్రకటన విడుదల చేసింది. సాధారణ పరీక్షల కోసమే ఆయన వచ్చారని, ఇవాళ(అక్టోబర్ 7న) డిశ్ఛార్జి చేస్తామని తెలిపింది.

సెప్టెంబర్​ 22న విజయకాంత్​తో పాటు ఆయన భార్య ప్రేమలతకు కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. విజయకాంత్ అప్పుడు కూడా ఇదే ఆస్పత్రిలో చేరారు. 10 రోజుల పాటు చికిత్స తీసుకొని అక్టోబర్ 2న డిశ్ఛార్జి అయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.