ETV Bharat / bharat

తెలంగాణలోని ఆ జిల్లాల్లో కరోనా రిస్క్ అధికం! - తెలంగాణాలో కరోనా ప్రమాదం లాన్సెట్ అధ్యయనం

కరోనా వల్ల తెలంగాణలోని జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఓ అధ్యయనంలో తేలింది. మధ్యప్రదేశ్​, బిహార్​ రాష్ట్రాల తర్వాత తెలంగాణ దేశంలో మూడో స్థానంలో నిలిచింది. ఈ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి, మరణాల రేటు అధికంగా ఉంటుందని పరిశోధన స్పష్టం చేసింది.

Districts in MP, Bihar, Telangana most vulnerable to COVID-19 pandemic, says Lancet study
తెలంగాణ జిల్లాల్లోనే మహమ్మారి విలయ తాండవం!
author img

By

Published : Jul 17, 2020, 5:42 PM IST

కరోనా మహమ్మారి వల్ల అత్యంత తీవ్రంగా ప్రభావితమయ్యే జిల్లాల విషయంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. హౌసింగ్, పరిశుభ్రత, వైద్య వ్యవస్థ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని చేపట్టిన అధ్యయనంలో తెలంగాణలోని జిల్లాలు అత్యంత తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని తేలింది. ఈ జాబితాలో మధ్యప్రదేశ్ తొలి స్థానంలో ఉండగా.. బిహార్​ రెండో స్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రాల్లోని జిల్లాల్లో వైరస్​ ప్రభావం అధికంగా ఉంటుందని అధ్యయనం పేర్కొంది. 'ద లాన్సెట్' జర్నల్​లో ఈ అధ్యయనం ప్రచురితమైంది.

ప్రస్తుతం ఎక్కువగా కేసులు లేనప్పటికీ భవిష్యత్తులో వైరస్ తీవ్రమయ్యే జిల్లాలను అధ్యయనం గుర్తించింది. ఈ జిల్లాలు తొమ్మిది రాష్ట్రాల్లో విస్తరించినట్లు వెల్లడించింది. ఈశాన్యం మినహా దేశవ్యాప్తంగా ఈ జిల్లాలు ఉన్నట్లు తెలిపింది.

ప్రమాద స్థాయిని బట్టి రాష్ట్రాల ర్యాంకింగ్

  • మధ్యప్రదేశ్
  • బిహార్
  • తెలంగాణ
  • ఝార్ఖండ్
  • ఉత్తర్​ప్రదేశ్​
  • మహారాష్ట్ర
  • బంగాల్
  • ఒడిశా
  • గుజరాత్​

ఈశాన్యంలో ప్రశాంతం!

15 సూచికల ద్వారా రాష్ట్రాలపై వైరస్ తీవ్రతను పరిశోధకులు అంచనా వేశారు. సామాజిక ఆర్థిక, జనాభా, గృహ-పరిశుభ్రత, సాంక్రమిక వ్యాధులు, ఆరోగ్య వ్యవస్థ అనే ఐదు అంశాల ఆధారంగా అధ్యయనం చేపట్టారు.

దీని ప్రకారం మధ్యప్రదేశ్​లో వైరస్ తీవ్రత స్కోరు ఒకటిగా ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. సిక్కింలో అత్యంత తక్కువగా సున్నాగా ఉన్నట్లు వెల్లడించారు. అరుణాచల్​ప్రదేశ్​, హిమాచల్​ ప్రదేశ్​ రాష్ట్రాల్లోనూ వైరస్ ప్రమాదం తక్కువగా ఉందని స్పష్టం చేశారు.

ప్రమాదమే కానీ సమాచారం పాతది

గుర్తించిన జిల్లాల్లో వైరస్ ఇన్ఫెక్షన్లు, వ్యాప్తి, మరణాల రేటు అధికంగా ఉంటుందని అధ్యయనంలో పాల్గొన్న దిల్లీకి చెందిన శాస్త్రవేత్త రాజీబ్ ఆచార్య స్పష్టం చేశారు. వైరస్​ వల్ల ఆర్థిక, సామాజిక ప్రభావంతో పాటు వ్యాధి సంక్రమణ ప్రమాదం అధికంగా ఉంటుందని తెలిపారు.

"కరోనా నియంత్రణ కోసం విధానకర్తలకు మా అధ్యయనం ఉపయోగపడుతుంది. ఏ ప్రాంతాలను ప్రాధాన్యంగా తీసుకొని వైరస్ కట్టడి చర్యలు, నిధుల కేటాయింపు చేపట్టాలనే విషయంలో నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది."

-శాస్త్రవేత్తలు

అయితే ఈ జిల్లాల్లో వైరస్ వ్యాప్తికి గల కచ్చితమైన కారణాలు తెలియలేదని అధ్యయనకర్తలు పేర్కొన్నారు. ప్రాంతీయ స్థాయిలో మరింత సమాచారం సేకరించడం ద్వారా రాష్ట్రాల్లో పరిస్థితిని పూర్తిస్థాయిలో అంచనా వేయవచ్చని చెప్పారు. అధ్యయనంలో ఉపయోగించిన డేటా రెండు నుంచి ఐదు సంవత్సరాల నాటిదని.. కాబట్టి ఇప్పటివరకు వేగంగా మార్పులు సంభవించిన జిల్లాల్లో సరైన అంచనాలు రాబట్టలేకపోవచ్చని అన్నారు.

ఇదీ చదవండి- నేపాల్​లో వీడని సస్పెన్స్- ఓలి భవితవ్యం తేలేది ఆదివారమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.