గల్వాన్ వద్ద భారత్-చైనా బలగాల ఉపసంహరణ కొనసాగుతోంది. పెట్రోలింగ్ పాయింట్ 15 వద్ద నుంచి దాదాపు 2 కిలోమీటర్ల మేర చైనా బలగాలు వెనక్కి వెళ్లాయి.
సైనిక కమాండర్ల స్థాయిలో మూడు దఫాలుగా జరిగిన చర్చలతోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ దౌత్యంతో సోమవారం ప్రారంభమైన బలగాల తరలింపు ప్రక్రియలో పురోగతి కనిపిస్తోంది.
భారత్ కూడా పలు ప్రాంతాల నుంచి.. సైన్యాన్ని వెనక్కి రప్పించినట్లు తెలుస్తోంది. అయితే.. నిఘా మాత్రం కొనసాగిస్తోంది.
ఇదీ చూడండి: చైనా విదేశాంగ మంత్రితో డోభాల్ చర్చలు