పోలింగ్ శాతాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. వికలాంగులు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ సూచన మేరకు కేంద్రం ప్రస్తుత నిబంధనలను సవరించింది.
ఇప్పటివరకు సాయుధ దళాలు, పోలింగ్ అధికారులు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశముంది. వృద్ధాప్యం, వైకల్యం కారణంగా ఎంతో మంది పోలింగ్ బూత్ వద్దకెళ్లి ఓటు వేయలేకపోతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పోలింగ్ శాతం పెంచుతుందని ఓ ఉన్నతాధికారి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: 'భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌కు భారతరత్న ఇవ్వండి'