ETV Bharat / bharat

పంటితో ప్రపంచ రికార్డు పట్టేసిన పోలీస్​ - jharkand news

బిహార్​లో పంటితో ఇనుప కడ్డీలను వంచేసి ప్రపంచ రికార్డు పట్టేశాడు ఓ పోలీసు అధికారి. ఒక్క నిమిషంలో 12మి.మీల 15 రాడ్లను వంచేశాడు.

dharmendra-of-kaimur-made-second-guinness-world-record-by-turning-15-bars-in-a-minute
పంటితో ప్రపంచ రికార్డు పట్టేసిన పోలీస్​!
author img

By

Published : Jul 21, 2020, 3:08 PM IST

Updated : Jul 21, 2020, 4:08 PM IST

బిహార్​ 'హ్యామర్​ హెడ్​మ్యాన్'​ ధర్మేంద్ర మరో రికార్డు సృష్టించేశాడు. ఒక్క నిమిషంలో 12 మి.మీల 15 ఇనుప కడ్డీలను పంటితో సునాయాసంగా వంచేసి గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డు నెలకొల్పాడు.

పంటితో ప్రపంచ రికార్డు పట్టేసిన పోలీస్​!

కైమూర్ జిల్లా, రామ్​గఢ్​కు చెందిన ధర్మేంద్ర ఓ రైతు కుటుంబంలో పుట్టాడు. నాన్న ​అపలేశ్వర్​ సాధారణ రైతు. తల్లి కుంతి దేవీ గ్రామపంచాయతీ సర్పంచ్​. ప్రస్తుతం త్రిపురలో ఎస్​ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న ధర్మేంద్రకు.. నిత్యం రికార్డులను వేటాడడం అలవాటే. 2015లో 12.మి.మీ పొడవు గల 24 ఇనుప కడ్డీలను తలతో వంచేసి గిన్నీస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్ రికార్డ్​ కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత 2017లో 51 పచ్చి వెలగ పండ్లను తలతో ఈజీగా బద్దలుగొట్టి మరో రికార్డు సృష్టించాడు.

2014 మార్చ్​లో అమెరికాకు చెందిన లేస్​ డేవిస్​ ఒక్క నిమిషంలో 10 ఇనుప కడ్డీలను పంటితో మెలితిప్పేడు. ఇప్పుడు ఆ రికార్డును బద్దలుకొట్టాడు ధర్మేంద్ర. 12 మిల్లీమీటర్ల 15 ఐరన్​ రాడ్లను పంటితో వంచేసి కొత్త రికార్డు సృష్టించాడు.

ఇదీ చదవండి: తల్లికి అంత్యక్రియలు జరిపి ఐదుగురు కుమారులు మృతి

Last Updated : Jul 21, 2020, 4:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.