ETV Bharat / bharat

కోటి ఆశలతో అడుగు పెడుతున్నాం.. ఆశీర్వదించు! - భక్తుల రద్దీ

నూతన సంవత్సరం సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాలు భక్తుల తాకిడితో రద్దీగా మారాయి. ప్రత్యేక పూజలు నిర్వహించి కొత్త ఏడాదికి స్వాగతం పలికారు.

devotees-perform-prayers-on-occasion-of-new-year
కోటి ఆశలతో అడుగుపెడుతున్నాం.. ఆశీర్వదించు!
author img

By

Published : Jan 1, 2021, 5:48 PM IST

Updated : Jan 1, 2021, 6:06 PM IST

2020 సంవత్సరం ఎందరో జీవితాల్లో చేదు జ్ఞాపకంలా మిగిలిపోయింది. వచ్చే ఏడాది తమ జీవితాల్లో కొత్త చిగురు తొడుగుకుంటాయనే ఆశతో అందరూ నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రముఖ దేవాలయాల్లో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాలు భక్తుల తాకిడితో కిటకిటలాడాయి.

కశ్మీర్​లో... కోల్​కతాలో..

జమ్ము కశ్మీర్​లోని వైష్ణోదేవి ఆలయం రద్దీగా మారింది. ఖాత్రాలో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

kashmir
కశ్మీర్​లోని వైష్ణోదేవీ ఆలయం
kolkata kali, కొత్​కతా కాళీ
కోల్​కతాలోని కాళీ ఆలయం

కోల్​కతాలోని కాళీ ఆలయం కూడా భక్తులతో కిటకిటలాడింది. వీలైనంత త్వరగా వ్యాక్సిన్​ రావాలని కోరుకుంటున్నానని ఓ భక్తురాలు తెలిపారు.

దిల్లీలో రద్దీ..

దిల్లీలోని లోధి రోడ్డులో ఉన్న సాయిబాబా మందిరంలో పూజలు నిర్వహించడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గురుద్వారా బంగ్లా సాహిబ్​లో భక్తులు పూజలు నిర్వహించారు. ఈ ఏడాది అందరికీ మంచి జరుగుతుందని ఆశిస్తున్నానని ఓ భక్తురాలు తెలిపారు.

delhi
దిల్లీ లోధీ రోడ్డులోని సాయిబాబా ఆలయం

గంగాహారతితో..

ఉత్తర్​ప్రదేశ్​లోని వారణాసిలో ప్రజలు గంగాహారతితో నూతన సంవత్సరాన్ని స్వాగతించారు.

బిహార్ రాజధాని పట్నాలోని మహవీర్​ ఆలయం భక్తుల తాకిడితో రద్దీగా మారింది.

patna, పట్నా
పట్నాలో మహవీర్​ ఆలయం

ముంబయిలోని ప్రముఖ సిద్ధివినాయక ఆలయంలో నూతన సంవత్సరం సందర్భంగా భక్తులు పూజలు నిర్వహించారు.

రైతు సమస్యలు తీరుతాయని..

పంజాబ్​లోని గోల్డెన్​ టెంపుల్​ను దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. అందరికీ మంచి జరగాలని కోరుకున్నామని, రైతు సమస్యలు తీరుతాయని ఆశిస్తున్నామని భక్తులు తెలిపారు.

amritsar
పంజాబ్​లోని గోల్డెన్ టెంపుల్​

బెంగుళూరులోని మల్లేశ్వరం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇదీ చూడండి : రాజకీయాల కోసం చదువుకు దూరమవ్వలేను: ఆర్య

Last Updated : Jan 1, 2021, 6:06 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.