దేశ వ్యాప్తంగా బక్రీద్ వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. త్యాగాలకు మారు పేరుగా ఈ పర్వదినాన్ని ముస్లిం సోదరులు జరుపుకుంటారు. దిల్లీ సహా అనేక రాష్ర్టాల్లోని మసీదులు, ఈద్గాల ఉదయం నుంచే ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
దిల్లీలోని ప్రఖ్యాత ఫతేపూర్, జామా మసీదు వద్ద నిర్వహించిన ప్రార్థనల్లో పెద్దలు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో పోలీసులు ఈద్గా ప్రాంగణాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మసీదుకు వచ్చే వారి ఉష్ణోగ్రతను తనిఖీ చేసి లోపలికి పంపిస్తున్నారు. మాస్కులు లేనిదే అనుమతించడం లేదు. భౌతిక దూరం పాటించాలని ప్రార్థనలకు వచ్చే వారికి అధికారులు సూచిస్తున్నారు.
ఇదీ చూడండి: ఉపాధ్యాయులకు బోధనేతర విధులొద్దు