కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామివారి ఆలయంలోకి భక్తులను అనుమతించరాదని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు నిర్ణయించింది. శబరిమల ప్రధాన పూజారి (తాంత్రి)తో సమావేశమైన బోర్డు... ఆలయ ఉత్సవాలను కూడా రద్దు చేయాలని నిశ్చయించింది. అయితే స్వామివారికి నెలవారీ పూజలు మాత్రం నిర్వహించనున్నట్లు కేరళ దేవస్వం మంత్రి కదకంపల్లి సురేంద్రన్ స్పష్టం చేశారు.
కరోనా సంక్షోభం, లాక్డౌన్ల కారణంగా దాదాపు మూడు నెలలపాటు శబరిమల అయ్యప్ప స్వామివారి ఆలయం తెరుచుకోలేదు. అయితే కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ సడలింపులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో జూన్ 14న స్వామివారి ఆలయం తెరవనున్నట్లు ట్రావెన్కోర్ దేవస్వం నిర్ణయించింది. దీనితో తమ ఇష్టదైవాన్ని కనులారా చూసుకోవచ్చని అయ్యప్ప భక్తులు ఆశించారు. కానీ బోర్డు నిర్ణయంతో వారికి నిరాశ తప్పలేదు.
ఇదీ చూడండి: తమిళనాడులో వేయికి పైగా ప్రాంతాల పేర్లు మార్పు