ETV Bharat / bharat

యడియూరప్ప​కు మద్దతు ఇచ్చేదిలేదు: దేవెగౌడ

జేడీఎస్​ అధినేత హెచ్​డీ దేవెగౌడ... నూతనంగా ఏర్పడిన యడియూరప్ప ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేది లేదని స్పష్టంచేశారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని తేల్చి చెప్పారు. కొంతమంది జేడీఎస్ నేతలు భాజపా సర్కార్​కు మద్దతు ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిపై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో దేవెగౌడ ఈ వ్యాఖ్యలు చేశారు.

యడియూరప్ప సర్కార్​కు మద్దతు ఇచ్చేదిలేదు: దేవెగౌడ
author img

By

Published : Jul 28, 2019, 10:15 AM IST

కర్ణాటకలో యడియూరప్ప ప్రభుత్వానికి తమ పార్టీ ఎలాంటి మద్దతు ఇవ్వబోదని జేడీఎస్​ అధినేత దేవెగౌడ స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వం చేపట్టిన ప్రతిపనిని జేడీఎస్ వ్యతిరేకించదు అని ఆయన పేర్కొన్నారు.

స్వాగతిస్తున్నా..

సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడం తనకు పెద్దవిషయమేమీ కాదని దేవెగౌడ పేర్కొన్నారు. అయితే ప్రతిపక్షంపై ప్రతీకార రాజకీయాలు చేయబోనని ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు.

"మేము నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం. ఓ ప్రాంతీయ రాజకీయపార్టీగా మేము ప్రభుత్వాన్ని వ్యతిరేకించాల్సిన చోట వ్యతిరేకిస్తాం. వారు (యడియూరప్ప) రాష్ట్రానికి ఏదైనా మంచి చేస్తే స్వాగతిస్తాం."-దేవెగౌడ, జేడీఎస్​ అధినేత

భాజపాకు మద్దతిచ్చేది లేదు

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని నిన్న కొంతమంది జేడీఎస్​ నేతలు కలిసి భాజపాకు మద్దతు ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన దేవెగౌడ.. భాజపాకు మద్దతు ఇచ్చేది లేదని తమ పార్టీ నిర్ణయాన్ని విస్పష్టంగా తేల్చిచెప్పారు.

రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాల నేపథ్యంలో బలపరీక్షలో ఓడి జేడీఎస్​-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. ఫలితంగా కర్ణాటకలో యడియూరప్ప నేతృత్వంలో భాజపా సర్కార్​ కొలువుదీరింది.

ఇదీ చూడండి: ఔరా: 'సూపర్​ క్రికెటర్'​ 15 రోజుల్లోనే సిద్ధం!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.